’ బెంగాల్ ను విభజించే ప్రశ్నే లేదు..ఎట్టి పరిస్థితిలోనూ దానిని అనుమతించాం ’ 

By Rajesh KarampooriFirst Published Oct 20, 2022, 4:04 AM IST
Highlights

బెంగాల్‌ను విభజించే ప్రశ్నే లేదని, తాను ఎట్టి పరిస్థితిలోనూ దానిని అనుమతించమని బెంగాల్ సీఎం  మమతా బెనర్జీ అన్నారు.ఉత్తర బెంగాల్‌లోని జిల్లాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత బిజెపి నాయకులలో ఒక వర్గం డిమాండ్ చేయడంతో మమతా బెనర్జీ ప్రకటన వచ్చింది.
 

పశ్చిమ బెంగాల్ విభజనను అనుమతించబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అన్నారు. సిలిగురిలో 'విజయ్ సమ్మేళన్', దుర్గాపూజ అనంతర సమావేశంలో ప్రసంగిస్తూ..రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. "దక్షిణ, ఉత్తర బెంగాల్ కలిసి పశ్చిమ బెంగాల్‌గా ఏర్పడిందనీ..  పశ్చిమ బెంగాల్‌ను విభజించే ప్రశ్న లేదని అన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ నిర్ణయాన్ని అనుమతించబోమని, ఒకే బెంగాల్‌గా ఉంటామని తెలిపారు. సమిష్టిగా క్రుషి చేస్తేనే ఉత్తర బెంగాల్ బలంగా ఉంటుందని, బెంగాల్ అభివృద్ధిలో తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మమతా బెనర్జీ అన్నారు.

కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ నేతల డిమాండ్ 

ఉత్తర బెంగాల్‌లోని జిల్లాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు డిమాండ్ చేయడంతో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు. బీజేపీ నేతలు కూడా ఇక్కడ అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో జిల్లాలోని ఎనిమిది జిల్లాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ ఏడాది ఈద్ మిలాద్-ఉన్-నబీని బాగా జరుపుకున్నారు. కొంతమంది అల్లర్లు స్రుష్టించడానికి ,శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి,  మత ఘర్షణలను ప్రేరేపించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే తాను మాత్రం శాంతియుత వేడుకలకు రెండు వర్గాలకూ మద్దతు ఇవ్వాలనుకుంటున్నాననీ తెలిపారు. కోల్‌కతాలోని ఎక్బాల్‌పూర్ ప్రాంతంలో ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత.. ఆమె మాట్లాడుతూ, కాళీ పూజ కూడా దగ్గరలోనే ఉంది. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జరుపుకోవాలని తాను కోరుతున్నానని సీఎం మమతా బెనర్జీ పేర్కోన్నారు.  

click me!