ఆటో ఎక్కడానికి నిరాకరించిందని..మహిళ ఎదురుగా ఆటో డ్రైవర్ నీచపు పని..

Published : Sep 12, 2019, 12:04 PM IST
ఆటో ఎక్కడానికి నిరాకరించిందని..మహిళ ఎదురుగా ఆటో డ్రైవర్ నీచపు పని..

సారాంశం

ముంబయిలోని చించోలీ బండర్ బస్టాప్ వద్ద బాధిత మహిళ బస్సు కోసం ఎదురుచూస్తోంది. విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లడానికి ఆమె అక్కడ వేచి ఉంది. ఆ సమయంలో షేక్ అబ్దుల్ కాదర్ మేనన్ అనే ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చాడు. సదరు మహిళను ఆటో ఎక్కాల్సిందిగా కోరాడు.   


మహిళ ఎదురుగా ఓ ఆటో డ్రైవర్ నీచపు పని చేశాడు. కావాలని మహిళ ఎదురుగా స్వయంతృప్తి లో పాల్గొన్నాడు. ఈ దారుణ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. కాగా... బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ ఘటన సెప్టెంబర్ 1వ తేదీన రాత్రి చోటుచేసుకుంది. ముంబయిలోని చించోలీ బండర్ బస్టాప్ వద్ద బాధిత మహిళ బస్సు కోసం ఎదురుచూస్తోంది. విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లడానికి ఆమె అక్కడ వేచి ఉంది. ఆ సమయంలో షేక్ అబ్దుల్ కాదర్ మేనన్ అనే ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చాడు. సదరు మహిళను ఆటో ఎక్కాల్సిందిగా కోరాడు. 

కాగా.. ఆటో ఎక్కడానికి ఆమె నిరాకరించింది. దీంతో.. ఆ ఆటో డ్రైవర్ వెంటనే తన ప్యాంట్ జిప్పు తీసి స్వయంతృప్తికి పాల్పడ్డాడు. అతను చేసిన పనికి మహిళ షాకయ్యింది. తర్వాత తేరుకొని ఆ ఆటో డ్రైవర్ ఫోటోని తీసింది. అనంతరం ఇంటికి చేరుకున్న మహిళ.. అతని ఫోటో చూపించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తాజాగా అతనిని అరెస్టు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?