వర్షాలు ఆగిపోవాలని ఆ దంపతులకు విడాకులు

By telugu teamFirst Published Sep 12, 2019, 10:33 AM IST
Highlights

ప్రస్తుతం భారీ వర్షాలతో మధ్యప్రదేశ్‌ తడిసిముద్దౌతోంది. కానీ కొద్ది నెలల క్రితం అసలు వర్షాలు లేవు. ముఖ్యంగా రాజధాని భోపాల్‌లో తీవ్ర నీటి ఎద్దడి. తాగడానికి కూడా నీరు దొరకని స్థితి. దాంతో భోపాల్‌ పట్టణ ప్రజలు వరుణుడి అనుగ్రహం కోసం కప్పలకు పెళ్లి చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ కుండపోత వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాలు ఆగిపోవాలని ఓ జంటకు గ్రామస్థులంతా కలిసి దగ్గరుండి మరీ విడాకులు ఇప్పించారు. అయ్యో వాళ్ల విడాకులకు.. వర్షానికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? ఆ జంట ఎవరో కాదు కప్పలు.  సాధారణంగా మన దేశంలో వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. అలా చేస్తే వర్షాలు పడతాయని కొందరి నమ్మకం. అయితే... కుండపోతగా ఆగకుండా కురుస్తున్న వర్షాలను అదుపు చేయాలంటే ఆ కప్పలకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన భోపాల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ప్రస్తుతం భారీ వర్షాలతో మధ్యప్రదేశ్‌ తడిసిముద్దౌతోంది. కానీ కొద్ది నెలల క్రితం అసలు వర్షాలు లేవు. ముఖ్యంగా రాజధాని భోపాల్‌లో తీవ్ర నీటి ఎద్దడి. తాగడానికి కూడా నీరు దొరకని స్థితి. దాంతో భోపాల్‌ పట్టణ ప్రజలు వరుణుడి అనుగ్రహం కోసం కప్పలకు పెళ్లి చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ కుండపోత వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గడిచిన 24 గంటల్లో భోపాల్‌లో 48మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దాంతో డ్యామ్‌లన్నింటిని తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాలను ఆపేందుకు ఓ వినూత్న ప్రయోగం చేశారు భోపాల్‌ ప్రజలు. గతంలో వర్షాల కోసం కప్పలకు పెళ్లి చేస్తే.. నేడు వర్షాలు ఆగిపోవాలని ఆ కప్పల జంటకు విడాకులు ఇప్పించారు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. కుండపోత వర్షాలను ఆపేందుకు ఇంద్రపూరి ప్రాంతానికి చెందిన శివ్‌ సేవా శక్తి మండల్‌ సభ్యులు గతంలో తాము పెళ్లి చేసిన కప్పలను విడదీశారు. వేదమంత్రాల సాక్షిగా, వైభవంగా ఈ వేడుక నిర్వహించడం గమనార్హం.

click me!