నీళ్లతో ఆడుకుంటోందని..రెండేళ్ల బిడ్డను కొట్టి చంపిన తల్లి.. గర్భిణి అరెస్ట్...

Published : Aug 10, 2021, 04:57 PM IST
నీళ్లతో ఆడుకుంటోందని..రెండేళ్ల బిడ్డను కొట్టి చంపిన తల్లి.. గర్భిణి అరెస్ట్...

సారాంశం

ఆమె రెండేళ్ల కూతురు నీళ్లతో ఆడుతూ కనిపించింది.  ఆగ్రహానికి గురైన నేహా  ఆ చిన్నారిని నేలకు విసిరి కొట్టింది. తల నుంచి రక్తం వస్తుండడంతో  కూతుర్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళింది. అయితే శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతినడంతో చిన్నారి మార్గమధ్యంలోనే మరణించింది.

మహారాష్ట్రలో ఓ మహిళ తన రెండేళ్ల కూతుర్ని కొట్టడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నేహా సోనీ అనే 22 ఏళ్ల గర్భిణిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం…  శనివారం రాత్రి 8 గంటల సమయంలో విరార్ (తూర్పు)లోని పూల్ పాడా నివాసి అయిన నేహా సోని అనే మహిళ తన కుమార్తెను ఇంటిలోపల నీటితో ఆడుకునే సమయంలో కొట్టింది.

దీంతో సృహ కోల్పోయిన ఆ పాపను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ చిన్నారి అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.  అయితే తాను బిడ్డను కొట్టినట్లు సోనీ ఆస్పత్రి వారికి చెప్పలేదు.  కానీ పొరుగున ఉండే వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ముంబైలోని జేజే ఆసుపత్రికి పంపించారు.

పోస్టుమార్టంలో తల, కడుపుపై పలు అంతర్గత గాయాలు అయినట్లు తేలింది. ఆ నివేదిక ఆధారంగా సోనీ పై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్యకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేష్ వర్హాడే తెలిపారు.  కాగా రిక్షా డ్రైవర్ అయిన సోని భర్త ఆ సమయంలో పనికి వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.

భార్య కోసం బిడ్డ మెడకు ఉరి బిగించాడు

కాగా, ముంబైకి చెందిన ఓ తల్లి ఘోరం నీళ్లతో ఆడుకుంటుందన్న కోపంతో కన్నకూతుర్నే దారుణంగా చంపింది. తూర్పు ముంబైకి చెందిన 22 ఏళ్ల  స్నేహ ప్రస్తుతం గర్భవతి. ఆమె భర్త ఆటో డ్రైవర్ గా పని చేస్తుంటాడు. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఆదివారం భర్త ఆటో తీసుకొని వెళ్లినప్పుడు ఇంట్లోనే ఉన్న  స్నేహ విశ్రాంతి తీసుకుంటోంది.

 ఆ సమయంలో ఆమె రెండేళ్ల కూతురు నీళ్లతో ఆడుతూ కనిపించింది.  ఆగ్రహానికి గురైన నేహా  ఆ చిన్నారిని నేలకు విసిరి కొట్టింది. తల నుంచి రక్తం వస్తుండడంతో  కూతుర్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళింది. అయితే శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతినడంతో చిన్నారి మార్గమధ్యంలోనే మరణించింది.

అయితే తాను కొట్టడం వల్లే పాప చనిపోయింది ఏ హాస్పిటల్ సిబ్బందికి చెప్పలేదు. అయితే నేహా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. స్నేహ పై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ఆమెను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు