IndiGo flight: జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం పాకిస్తాన్‌లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అసలేం జరిగింది. ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండ్ కావాల్సి వచ్చింది.
IndiGo flight emergency landing : ఇండిగో విమానం పాకిస్తాన్‌లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో అంతర్జాతీయ విమానంలో ప్రయాణికుడికి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి రావడంతో పాకిస్థాన్‌లోని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వార్తా సంస్థ ANI ప్రకారం.. విమానయాన సంస్థ గురువారం (నవంబర్ 23) ఈ సమాచారాన్ని ఇచ్చింది. కానీ, ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడలేదు, ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. ఈ విషయాన్ని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన బుధవారం జరిగింది.
జెడ్డా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానం 6E68లో వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దీంతో కెప్టెన్ విమానాన్ని కరాచీ వైపు మళ్లించాడు. అక్కడికి చేరుకున్న ప్రయాణీకుడికి వైద్యుడు చికిత్స అందించాడు. కానీ, దురదృష్టవశాత్తు,ఆ ప్రయాణీకుడ్ని ప్రాణాలతో కాపాడలేకపోయారు. ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత, విమానం కరాచీ నుండి బయలుదేరి 0908 IST వద్ద హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది" అని ఎయిర్‌లైన్ తెలిపింది.
గతంలో ఇలాంటి ఘటన
ఆగస్టులో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో ముంబై నుంచి రాంచీకి వెళ్తున్న ఇండిగో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని నాగ్‌పూర్ వైపు మళ్లించారు. ఈ ఘటనలో కూడా ప్రయాణికుడ్నికాపాడలేకపోతున్నారు. ప్రయాణికుడిని ఆస్పతికి తరలించే లోపే చనిపోయినట్లు ప్రకటించారు.
అదే సమయంలో ఈ సంవత్సరం మార్చిలో ఇండిగో యొక్క ఢిల్లీ-దోహా ఫ్లైట్ 6E-1736 ఒక నైజీరియా ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడంతో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్తాన్‌లోని కరాచీలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్టు వైద్యబృందం ప్రయాణికుడు రాగానే చనిపోయినట్లు ప్రకటించిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. మృతుడు నైజీరియాకు చెందిన 60 ఏళ్ల అబ్దుల్లాగా గుర్తించారు.