ముంబైలో పుట్‌పాత్‌పై పాదచారులను ఢీకొన్న కారు: నలుగురు మృతి

Published : Sep 01, 2020, 11:33 AM IST
ముంబైలో పుట్‌పాత్‌పై పాదచారులను ఢీకొన్న కారు: నలుగురు మృతి

సారాంశం

మహారాష్ట్రలోని ముంబై నగరంలో కారు ప్రమాదంలో నలుగురు మరణించారు. ముంబై పట్టణంలోని క్రాఫోర్డ్ మార్కెట్లో సోమవారం నాడు రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కొలంబో జంక్షన్ లోని కేఫ్ జనతా వద్ద పుట్ ఫాత్ పై  అదుపుతప్పిన కారు దూసుకు వచ్చింది. 


ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో కారు ప్రమాదంలో నలుగురు మరణించారు. ముంబై పట్టణంలోని క్రాఫోర్డ్ మార్కెట్లో సోమవారం నాడు రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కొలంబో జంక్షన్ లోని కేఫ్ జనతా వద్ద పుట్ ఫాత్ పై  అదుపుతప్పిన కారు దూసుకు వచ్చింది. 

పుట్ పాత్ పై ఉన్న వారిలో పలువురిని కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఓ వ్యక్తి కారుపై పడి మరణించారు. మరో ముగ్గురు సమీపంలోని రెస్టారెంట్ లో ఎగిరిపడ్డారు. 

ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముంబైకి చెందిన జ్యోతి బాబరియాకు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు.ఈ ప్రమాదంలో కారు డ్రైవర్  సమీర్ ఇబ్రహీంకి కూడ గాయాలయ్యాయి. 

కారు అతివేగంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొన్నట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu