యూపీ ప్రభుత్వ లాంఛనాలతో ములాయం అంత్యక్రియలు.. ఎక్క‌డ జరుగనున్నాయంటే..?

By Rajesh KarampooriFirst Published Oct 10, 2022, 3:38 PM IST
Highlights

యూపీ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాద‌వ్ అంత్య‌క్రియలు అక్టోబ‌ర్ 11న ఆయ‌న స్వ‌గ్రామం సాయ్‌ఫాయ్‌లో జ‌రుగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న భౌతిక కాయాన్ని గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్ప‌త్రి నుంచి త‌న గ్రామం సాయ్‌ఫాయ్‌కు త‌ర‌లించారు.  

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూశారు. గత నెల రోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌నను అక్టోబర్ 1 రాత్రి ICUకి తరలించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న ఉద‌యం  8:30 గంటల తుదిశ్వాస విడిచారు. ములాయం మృతి ప‌ట్ల‌ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా దేశంలోని అగ్ర‌నేతలంతా సంతాపం తెలిపారు. 

అయితే.. ఆయ‌న‌ అంత్య‌క్రియలు అక్టోబ‌ర్ 11న ఆయ‌న స్వ‌గ్రామం సాయ్‌ఫాయ్‌లో నిర్వహించనున్నారు. ఎస్పీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్ర‌చారం.. ములాయం మృతదేహాన్ని లక్నోకు తరలించనున్నారు. అక్కడ ఆయన భౌతికకాయాన్ని పార్టీ కార్యాలయం, అసెంబ్లీలో ఉంచనున్నారు. రేపు అంటే అక్టోబర్ 11న మధ్యాహ్నం 3 గంటలకు సైఫాయిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మృతితో సమాజ్‌వాదీ పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ములాయం సింగ్ యాద‌వ్‌ అంత్య‌క్రియ‌ల‌ను పూర్తిగా రాష్ట్ర ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించ‌నున్న‌ట్లు యూపీ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ తెలిపారు. ములాయం మృతిప‌ట్ల ఆయ‌న తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. 

నితీశ్ కుమార్ సంతాపం

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. తన సంతాప సందేశంలో నితీష్ కుమార్ యాదవ్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ములాయం 1990లలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా, ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత నెల ఢిల్లీ పర్యటనలో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఎస్పీ వ్యవస్థాపకుడిని నితీష్ కుమార్ ప‌రామ‌ర్శించారు.  

2017లో అధికార పీఠాన్ని అఖిలేష్ కు  అప్పగింత .

2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి పూర్తి మెజారిటీ రావడంతో ములాయం సింగ్ యాదవ్ తన అధికార పీఠాన్ని తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు అప్పగించారు. 2017 జనవరిలో ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేష్ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎస్పీలో ములాయం హోదా 'నేతాజీ'గా కొనసాగింది. యాదవ్ తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ప్రతి విజయం, వైఫల్యంలో ఆయ‌న  ఎస్పీ కార్యకర్తలతో పంచుకున్నారు.  

click me!