15 నెలలకే బడిబాట.. అక్షరాలు దిద్దబోతున్న ముఖేష్ అంబానీ మనవడు...

Published : Mar 22, 2022, 07:17 AM IST
15 నెలలకే బడిబాట.. అక్షరాలు దిద్దబోతున్న ముఖేష్ అంబానీ మనవడు...

సారాంశం

పదిహేను నెలలనే ఆ చిన్నారి బడిబాట పట్టాడు. తాత పేరు నిలబెట్టడానికి ఇప్పటినుంచే తహతహలాడుతున్నాడు. తల్లిదండ్రులతో కలిసి బుడిబుడి అడుగులేస్తూ ప్లే స్కూల్ లో చేరాడు. అతనే దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ మనవడు పృథ్వీ ఆకాష్ అంబానీ. 

ముంబై : Reliance Industries అధినేత Mukesh Ambani మనవడు Prithvi Akash Ambani తన తల్లి శ్లోకా మెహతాతో కలిసి బుడి బుడి అడుగులతో బడి బాట పట్టాడు. ముంబైలోని ఒక Play School లో అడుగుపెట్టాడు. 15 నెలల వయసున్న ఆ చిన్నారినిి తల్లిదండ్రులు శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీలు ఎత్తుకుని తీసుకువచ్చారు. దేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన పృథ్వీ ఆకాష్ అంబానీని మలబార్ హిల్ లోని సన్ ఫ్లవర్ స్కూల్ కు పంపాలని ముఖేష్ అంబానీ కుటుంబం నిర్ణయించుకుంది. 

పృథ్వి అంబాని తల్లిదండ్రులు కూడా ఇదే పాఠశాలలో చదువుకోవడం విశేషం.  పృథ్వి తల్లిదండ్రులు తమ కుమారునికి సురక్షితమైన వాతావరణం, నాణ్యమైన విద్యను అందించడానికి ఈ స్కూల్ ను ఎంచుకున్నారు. పృథ్వి సాధారణ జీవితాన్ని గడపాలని ముఖేష్ అంబానీ కుటుంబం కోరుకోవడం విశేషం. పృథ్వి అంబానీ భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని సన్నాహాలు చేశారు. పృథ్వి అంబాని క్షేమంగా ఉండేందుకు ఆయన  వెంట ఎప్పుడూ ఒక డాక్టర్ ఉండనున్నారు. అంబానీ మొదటి మనవడి విషయంలో భద్రత చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అతని చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు. వారు సాధారణ దుస్తుల్లో ఉంటారు. అటుగా వచ్చే వారిపై నిఘా పెడుతుంటారు. 2019 లో వివాహం చేసుకున్నశ్లోకా మెహతా, ఆకాష్ అంబానీలకు పృథ్వి 20 ఆకాష్ అంబానీ డిసెంబర్ 10, 2020న జన్మించారు.

ఇదిలా ఉండగా,  ఆకాశ్ అంబానీ, భార్య శ్లోకా అంబానీ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుక డిసెంబర్ 10, 2021 శనివారం సాయంత్రం జామ్ నగర్ లో జరిగింది. పృథ్వీ ఆకాశ్ అంబానీ మొదటి బర్త్ డే సందర్భంగా వంద మంది పూజారులు ఆశీర్వదించారు. మరోవైపు బాలీవుడ్ తారలు రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్, సచిన్ టెండూల్కర్ తో సహా మరి కొంతమంది సెలెక్టెడ్ అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు.  అతిథులు ఈ పుట్టినరోజు కోసం అనుసరించాల్సిన భద్రతా ప్రోటోకాల్ ను ముందుగానే నోట్ ద్వారా తెలియజేశారు. 

వేడుకల్లో పాల్గొనే అతిథులందరికీ సెకండ్ డోస్ వ్యాక్సిన్ పొంది ఉండాలని సూచించారు. ఇక ముంబై వెలుపల ఉన్న అతిథులు డిసెంబర్ 7 నుండి కరోనా టెస్ట్ రిపోర్ట్ వెల్లడించాలని తెలిపారు. ఇక ఆహ్వానితులు నివసించే నగరం నుండి ప్రైవేట్ జెట్ లో జామ్ నగర్ కి వెళ్లే సదుపాయం కూడా కల్పించారు. దీనికోసం పదవ తేదీన ముంబై నుండి జామ్ నగర్ కు విమానాలు నిర్వహించారు.  అలాగే 11వ తేదీన ముంబైకి తిరిగి  విమానాలు ఏర్పాటు చేశారు.  జామ్ నగర్ లోని ఫ్యామిలీ గెస్ట్ హౌస్ లో అతిథులు ఉండేందుకు అవకాశం ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ చెఫ్ లతో…
ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో Shloka ambani  తన కుమారుడు  పృథ్వి అంబానీ పుట్టినరోజు కోసం నెదర్లాండ్స్ నుండి బొమ్మలను తెప్పించారు. అలాగే ఇటలీ, థాయిలాండ్ కు చెందిన అంతర్జాతీయ చెఫ్ ల బృందం ఈ వేడుకలో విందు ను సిద్ధం చేశారు. వేడుకకు సంబంధించిన సమాచారం ప్రకారం జామ్ నగర్ లోని అనాధాశ్రమంలకు బహుమతులు, బొమ్మలు కూడా పంపారు. అలాగే అంబానీ ఫామ్హౌస్ చుట్టూ నివసించే గ్రామస్తులు అందరికీ ఆహారం పంపించారు. మీడియా నివేదికల ప్రకారం పుట్టిన రోజు వేడుకల కోసం 120 మంది అతిథులను ప్రైవేట్ జెట్ ద్వారా జామ్ నగర్  కుపంపారు .

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu