Ambani Threat Calls: అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్.. నిందితుడిని ఆగస్టు 20 వరకు కస్టడీకి త‌ర‌లింపు

Published : Aug 17, 2022, 12:50 AM ISTUpdated : Aug 17, 2022, 12:55 AM IST
Ambani Threat Calls: అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్.. నిందితుడిని ఆగస్టు 20 వరకు కస్టడీకి త‌ర‌లింపు

సారాంశం

Mukesh Ambani Threat Calls:పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరింపుల‌కు పాల్పడిన న‌గ‌ల వ్యాపారి బిష్ణు విధు భౌమిక్ (56)ని ముంబై కోర్టు ఆగస్టు 20 వరకు పోలీసు కస్టడీకి పంపింది.  

Mukesh Ambani Threat Calls: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరింపుల‌కు పాల్పడిన న‌గ‌ల వ్యాపారి బిష్ణు విధు భౌమిక్ (56)ని ముంబై కోర్టు ఆగస్టు 20 వరకు పోలీసు కస్టడీకి పంపింది.  రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి అంబానీని, అతని కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించినందుకు బిష్ణు విధు భౌమిక్ (56)ని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలో నగల దుకాణం నడుపుతున్న భౌమిక్‌ను దహిసర్‌లో పట్టుకున్నారు.

నిందితుడిని పోలీసులు మంగ‌ళ‌వారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్ వి దిండోకర్ కోర్టులో హాజరుపరిచారు. ఫోన్‌లో బెదిరింపులకు గల కారణాలను విచారించడానికి అతని కస్టడీని కోరారు. నిందితుడు సాధారణ నేరస్థుడిగా కనిపిస్తోందని, అందువల్ల ఈ కేసులో మరెవ్వరి ప్రమేయం ఉందో ? లేదో? తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు కోర్టుకు తెలిపింది.
  
'నిందితుడు మానసిక రోగి'
భౌమిక్ తరపు న్యాయవాది విజయ్ కుమార్ మానే వాదిస్తూ.. రిమాండ్ అభ్యర్థనను వ్యతిరేకించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అంబానీకి కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి ఫోన్ చేసినందున తన క్లయింట్‌కు కేసుతో ప్రత్యక్ష సంబంధం లేదని వాదించారు. నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స పొందుతున్నాడని మానే కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితులను ఆగస్టు 20 వరకు పోలీసు కస్టడీకి పంపింది.

తొమ్మిది సార్లు బెదిరింపు కాల్స్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భౌమిక్ సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ల్యాండ్‌లైన్ నంబర్‌కు తొమ్మిది సార్లు కాల్ చేసి, అంబానీ,  అతని కుటుంబ సభ్యులను దుర్భాషలాడడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు. అతనిపై డిబి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506(2) కింద క్రిమినల్ బెదిరింపు కేసు నమోదైంది.
 
మ‌రోవైపు.. ఫిబ్రవరి 2021లో అంబానీ దక్షిణ ముంబై నివాసం 'యాంటిలియా' సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన SUV కనుగొనబడింది. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి అప్పటి పోలీసు అధికారి సచిన్ వాజేతో సహా కొంతమందిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు