
Mukesh Ambani Success Secret: ముఖేష్ అంబానీ ఊరికే ఆసియాలోనే అత్యంత ధనవంతుడు కాలేదు. ఆయనకున్న కొన్ని అలవాట్లు ఆయనను సక్సెస్‌ఫుల్ బిజినెస్ మెన్ ను చేసాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయన డైలీ రొటీన్ యంగ్ స్టర్స్ కి స్ఫూర్తినిస్తుంది. ఆయన లైఫ్‌స్టైల్, డైట్ చాలా సింపుల్ గా ఉంటాయి.
ముఖేష్ అంబానీ ప్రతిరోజు తన ఫ్యామిలీతో గడుపుతారు. ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లినా ఒక పని చేయకుండా వెళ్లరు. అది ఆయన్ని చాలా రియల్ వ్యక్తిగా చూపిస్తుంది. ఇంతకూ ముఖేష్ అంబానీ తన ఇల్లు యాంటిలియా నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేసే ఆ సీక్రెట్ హ్యాబిట్ గురించి తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ (Mukesh Ambani) బిజినెస్ టైకూన్ అయినా, ప్రపంచంలో ఆయనకు మంచి పేరు ఉన్నా తన సంస్కారాన్ని ఎప్పుడూ మర్చిపోరు. ఆయన చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. పూజలు, దేవుళ్లంటే చాలా నమ్మకం. ఆయనను చాలా సార్లు గుడుల్లో చూస్తుంటాం. మోడ్రన్ గా ఉన్నప్పటికీ తన మూలాలను ఎప్పుడూ మర్చిపోరు. అందుకే ఆయనను ఫ్యామిలీ మ్యాన్ అని కూడా అంటారు.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం ముఖేష్ అంబానీ ఆదివారం తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతారు. కానీ ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లినా ఒక పని మాత్రం చేయడం మర్చిపోరు. అది తన తల్లి ఆశీర్వాదం తీసుకోవడం. ఆదివారం అయినా, సోమవారం అయినా ప్రతిరోజు రిలయన్స్ ఛైర్మన్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్లి ఆమె కాళ్లకు నమస్కారం చేస్తారు. ఆయన తన తల్లి కోకిలాబెన్ అంబానీకి (Kokilaben Ambani) చాలా దగ్గరగా ఉంటారు. తన తల్లి ఆశీర్వాదమే తన అభివృద్ధికి, విజయానికి కారణమని చెబుతారు.
అంబానీ తన ఫ్యామిలీకి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన భార్య నీతా అంబానీ (Nita Ambani) బిజినెస్ తో పాటు ఇంటిని కూడా చక్కగా చూసుకుంటారు. ఒక ఇంటర్వ్యూలో నీతా అంబానీ మాట్లాడుతూ ముఖేష్ ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు రాత్రి డిన్నర్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసే చేస్తారని చెప్పారు. వీకెండ్ లో పని చేయకుండా మొత్తం సమయం ఫ్యామిలీతోనే గడుపుతారని తెలిపారు.