మోసం చేశారు: రూ.15 కోట్లకు మాజీ వ్యాపార భాగస్వామ్యులపై ధోని కేసు

By narsimha lode  |  First Published Jan 5, 2024, 3:44 PM IST

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వామ్యులపై  కేసు పెట్టాడు.  



న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని  ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కు చెందిన ఇద్దరు అధికారులపై  రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేశారు. 2017 క్రికెట్ అకాడమీ  డీల్ పై  ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కు  చెందిన  ఇద్దరిపై  కేసు వేశాడు ధోని.మిహిర్ దివాకర్,  సౌమ్య విశ్వాస్ లపై  కేసు నమోదైంది. 

2017లో  దివాకర్ ప్రపంచ వ్యాప్తంగా  క్రికెట్ అకాడమీ నిర్వహించేందుకు  మహేంద్ర సింగ్ ధోనితో ఒప్పందం కుదుర్చుకున్నారు.  అయితే ఈ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలకు కట్టుబడలేదని  ధోని ఆరోపించారు.

Latest Videos

ఆర్కా స్పోర్ట్స్  ఫ్రాంచైజీ రుసుమును చెల్లించి ఒప్పంద నిబంధనల ప్రకారం లాభాలను పంచుకోవాల్సి ఉంది.అయితే  ఈ నిబంధనలను పాటించలేదని  ధోని ఆరోపిస్తున్నారు. పదే పదే ఈ విషయమై  గుర్తు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.  దీంతో  2021 ఆగస్టు  మహేంద్ర సింగ్ ధోని  ఆ సంస్థకు మంజూరు చేసిన  అధికార లేఖను ఉపసంహరించుకొన్నారు. ఆ తర్వాత  ధోని అనేక లీగల్ నోటీసులు కూడ పంపాడు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్కా స్పోర్ట్స్ ద్వారా తాము మోసపోయినట్టుగా  దయానంద్ సింగ్  ద్వారా  ధోని  ఆర్కా స్పోర్ట్స్  దృష్టికి తీసుకు వచ్చారు. తమకు రూ. 15 కోట్ల నష్టం వాటిల్లిందని  పేర్కొన్నారు.

click me!