యూపీ జైళ్లలో రామాలయ ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం..

By SumaBala Bukka  |  First Published Jan 5, 2024, 3:03 PM IST

యూపీలోని జైళ్లలో రామమందిర ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. జైళ్లలో దీపోత్సవం కూడా ఉంటుంది. తద్వారా ఖైదీలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. యూపీ జైళ్ల శాఖ మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి జైలర్లందరికీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.


అయోధ్య : దేశంలోని రామభక్తులంతా వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆ చారిత్రాత్మక రోజు జనవరి 22న రాబోతోంది. ఆ రోజున రామనగరి అయోధ్యలో కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడైన శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ప్రపంచం మొత్తం ఈ క్షణాలకోసం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం పెద్ద చొరవ తీసుకుంది. యూపీలోని జైళ్లలో రామమందిర ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తద్వారా ఖైదీలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు, ఇందులో భాగస్వాములు కావచ్చు. జైళ్లలో దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. 

జైళ్లలో రామమందిర ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం..
ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి రాష్ట్రంలోని పెద్ద జైళ్లను సందర్శించారు. ఈ జైళ్లలో రామమందిర ప్రాణప్రతిష్ఠను ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతే కాదు జైలులో ఉన్న ఖైదీలకు పోలీసులు హనుమాన్ చాలీసా, సుందర్‌కాండ పుస్తకాలను పంపిణీ చేస్తారు. ఖైదీలు కూడా ఈ రోజున దేవుడిని పూజించవచ్చు. జైళ్లలో భక్తి వాతావరణం నెలకొల్పేందుకు అన్ని జైళ్లలో దీపోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

Latest Videos

ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతీరాయికి శల్యపరీక్షలు.. ఐదు రకాల టెస్టులు తరువాతే...

ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జైలు నుంచి ఖైదీల విడుదల
ఉత్తరప్రదేశ్ జైళ్లశాఖ మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి అలీఘర్ జిల్లా జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న 10 మంది ఖైదీలను విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. జరిమానా చెల్లించలేక ఏళ్ల తరబడి ఇక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఈ సందర్భంగా విడుదలయ చేశారు.  జనవరి 22 దేశానికే కాకుండా ప్రపంచానికి గొప్ప రోజు అని మంత్రి అన్నారు. ఆ రోజు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తాడని చెప్పారు. 

click me!