రాహుల్ గాంధీ కరోనావైరస్ వ్యాప్తి చేస్తాడు: బిజెపి ఎంపీ సెటైర్

By telugu team  |  First Published Mar 5, 2020, 1:14 PM IST

కాంగ్రెసు నేత, ఎంపీ రాహుల్ గాంధీపై బిజెపి ఎంపీ రమేష్ బిధూరీ సెటైర్లు వేశారు. ఆరు రోజుల క్రితమే రాహుల్ గాంధీ ఇటలీ నుంచి తిరిగి వచ్చారని, ఆయనకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.


న్యూఢిల్లీ: కాంగ్రెసు నేత రాహుల్ గాంధీపై బిజెపి ఎంపీ రమేష్ బిధూరి సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ ఇటీవలే ఇటలీ నుంచి తిరిగి వచ్చారని, అందువల్ల కరోనావైరస్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన గురువారం పార్లమెంటులో అన్నారు 

ఇటలీ నుంచి వచ్చినవారిలో చాలా మందికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన లోకసభలో అన్నారు. ఆరు రోజుల క్రితమే రాహుల్ గాంధీ ఇటలీ నుంచి తిరిగి వచ్చారని, అందువల్ల కరోనావైరస్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన అన్నారు. 

Latest Videos

undefined

పార్లమెంటు సభ్యులు ప్రజలను కలుస్తుంటారని చెబుతూ రాహుల్ గాంధీ వద్ద కూర్చునే ఎంపీలకు కూడా కరోనావైరస్ సోకే ప్రమాదం ఉందని, అందువల్ల రాహుల్ గాంధీ తనంత తాను పరీక్షలు చేయించుకుని, పరిస్థితి ఏమిటో పార్లమెంటుకు చెప్పాలని ఆయన అన్నారు. 

బుధవారంనాడు కూడా బిధూరీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ పై ముందు జాగ్రత్తలు తీసుకోకుండా రాహుల్ గాంధీ అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో తిరిగారని ఆయన అన్నారు. 

"జాగ్రత్తలు తీసుకోవాలి... ప్రజలను (సీఏఏపై) తప్పుదోవ పట్టించారు. ప్రజలు ఇటు వైపో అటు వైపో ఉండాలని మీ అమ్మ చెప్పారు.... మొదట హింసను ప్రేరేపిస్తారు... ఆ తర్వాత సంఘీభావం తెలియజేస్తారు.. అక్కడికి వెళ్లడానికి ముందు  నేను అడగదలుచుకున్నదేమిటంటే.. ఆరు ఆరు రోజుల క్రితమే ఇటలీ నుంచి మీరు తిరిగి వచ్చారు.. విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్టు చేయించుకున్నారా..  (కరోనా వైరస్ కు సంబంధించి) ముందు జాగ్రత్తలు తీసుకున్నారా, లేదంటే వ్యాప్తి చేయాలనుకుంటున్నారా" అని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.

click me!