పెళ్లిలో కాల్పులు.. భర్త చేతిలో భార్య మృతి

Published : Apr 16, 2019, 09:48 AM IST
పెళ్లిలో కాల్పులు.. భర్త చేతిలో భార్య మృతి

సారాంశం

పెళ్లిలో సరదాగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపుతుండగా... బులెట్ ఆయన భార్యకే తగిలింది. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 


పెళ్లిలో సరదాగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపుతుండగా... బులెట్ ఆయన భార్యకే తగిలింది. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకివెళితే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన  ఆప్ సింగ్... గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇటీవల తన భార్య పిల్లలతో కలిసి తన సోదరుడి వివాహానికి హాజరయ్యారు. వివాహ ఆచారంలో భాగంగా గాలిలోకి తుపాకీతో కాల్పులు జరుపుతుంటారు. మాజీ ఆర్మీ మేయర్ కూడా తన తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు.

అనంతరం తుపాకీలో బుల్లెట్స్ అయిపోవడంతో.. వాటిని నింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. అది కాస్త ఆయన భార్య రజినీ కి తగిలింది. దీంతో.. ఆమె తీవ్రగాయమై రక్త స్రావం జరిగింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆనందంతో సాగాల్సిన పెళ్లిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే
Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే