త్వరలోనే ఎంపీ సీట్ల పెరుగుదల: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Published : May 28, 2023, 02:24 PM IST
 త్వరలోనే  ఎంపీ సీట్ల పెరుగుదల: ప్రధాని మోడీ  కీలక  వ్యాఖ్యలు

సారాంశం

త్వరలోనే  ఎంపీల సీట్లు  పెరగనున్నాయని  ప్రధాని  నరేంద్ర మోడీ  పేర్కొన్నారు.  కొత్త  పార్లమెంట్  భవనం  ప్రారంభోత్సవ  కార్యక్రమంలో  ప్రధాని  ఈ వ్యాఖ్యలు  చేశారు. 

న్యూఢిల్లీ: త్వరలో  ఎంపీల సీట్లు పెరుగుతాయని ప్రధాని మోడీ  తెలిపారు.కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ  ఆదివారంనాడు  పారంభించారు. ఈ సందర్భంగా  ఆయన  ప్రసంగించారు.పాత పార్లమెంట్ లో  సాంకేతిక  సమస్యలున్నాయని మోడీ గుర్తు  చేశారు.  ఎంపీలకు  తగినన్ని సీట్లు కూడా లేవన్నారు.   త్వరలో  ఎంపీ సీట్లు పెరిగితే  పాత  పార్లమెంట్ లో  సభ్యులు  కూర్చొనే  పరిస్థితి లేదన్నారు. కొత్త పార్లమెంట్  భవనంలో  888 మంది  సభ్యులు  కూర్చొనే సామర్ధ్యం  ఉంది.  రానున్న రోజుల్లో  నియోజకవర్గాల పునర్విభజనతో  ఎంపీ సీట్ల సంఖ్యను పెంచే అవకాశం  ఉంది.  భవిష్యత్తులో  పెరిగే  ఎంపీల  సంఖ్యకు అనుగుణంగా   కొత్త  పార్లమెంట్ భవనంలో  సీట్ల  సంఖ్య ను  ఏర్పాటు  చేశారు. 

also read:కొత్త పార్లమెంట్ భవనం కొత్త ప్రజాస్వామ్యానికి దేవాలయం: మోడీ

ఎంపీ  సీట్ల  పెంపుదల  పెరుగుదలపై  డిలీమిటేషన్ కమిషన్  ఏర్పాటుపై  కేంద్రం దృష్టి కేంద్రీకరించింది.1973 లో  31వ రాజ్యాంగ  సవరణ ద్వారా ఎంపీ సీట్ల సంఖ్యను  524 నుండి  545కు పెంచారు.1976లో   25 ఏళ్ల  పాటు ఎంపీ సీట్ల సంఖ్య  పెంపును స్థంభింప  చేస్తూ   నిర్ణయం తీసుకున్నారు.  201లో  కూడా  25 ఏళ్ల పాటు ఎంపీల సంఖ్యను  స్థంభింప చేయాలని  నిర్ణయం తీసుకున్నారు. 2026  కొత్త డిలిమీటేషన్  కమిషన్ ఏర్పాటు  కావాల్సి ఉంది. కుటుంబ నియంత్రణ  కార్యక్రమాలను విజయవంతంగా  అమలు  చేసి  జనాభా  పెరుగుదలను  నియంత్రించిన  రాష్ట్రాలు  డీలిమిటేషన్ లో  నష్టపోకుండా  చూడాల్సిన  బాధ్యత ప్రభుత్వంపై  ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్