వలస కార్మికులకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు: ప్రధానికి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ధన్యవాదాలు

Published : May 02, 2020, 12:18 PM ISTUpdated : May 02, 2020, 01:12 PM IST
వలస కార్మికులకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు: ప్రధానికి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ధన్యవాదాలు

సారాంశం

కరోనా కష్టకాలంలో ఇలా శ్రామిక్ ప్రత్యేకరైళ్లని చిక్కుబడ్డ వలస కార్మికులను తరలించడానికి నడపడం చాలా ఉపయుక్తకరమని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. చాలా రాష్ట్రాలు ఇలా చిక్కుబడ్డ వలస కూలీలను చూసుకోలేకపోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇలా ప్రత్యేకమైన రైళ్లను వేయడం ద్వారా ఈ మహమ్మారి కాలంలోనే అత్యంత భారీ స్థాయిలో జరిగిన ప్రజా రవాణా గా ఇది ప్రపంచ చరిత్రలో నిలబడిపోతుందని ఆయన అన్నారు.

కరోనా వైరస్ వల్ల ఎక్కడెక్కడో చిక్కుబడ్డ కార్మికులను, వలస కూలీలను తమ సొంత ఊర్లకు తరలించడానికి ఇప్పటికే కేంద్రం అనుమతులను ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక రైలు ఝార్ఖండ్ లోని హతియా కు కూడా బయల్దేరి వెళ్ళింది. 

ఈ నేపథ్యంలో చిక్కుకున్న మరింతమంది కార్మికులను తరలించడానికి కేంద్రం శ్రామిక్ ప్రత్యేకరైళ్లను నడపనుంది. ఇవి దేశంలోని ఒక ఊరి నుండి మరొక ఊరికి నాన్ స్టాప్ గా వెళతాయి. మధ్యలో ఎక్కడా ఆగవు. 

వలసకూలీలను తమ రాష్ట్రానికి తెచ్చుకోవాలనుకున్న రాష్ట్రం, వారు చిక్కుబడ్డ రాష్ట్రంతో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపిన తరువాత కేంద్రానికి విన్నవిస్తే... కేంద్రం అప్పుడు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. 

ఈ కరోనా కష్టకాలంలో ఇలా శ్రామిక్ ప్రత్యేకరైళ్లని చిక్కుబడ్డ వలస కార్మికులను తరలించడానికి నడపడం చాలా ఉపయుక్తకరమని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. చాలా రాష్ట్రాలు ఇలా చిక్కుబడ్డ వలస కూలీలను చూసుకోలేకపోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇలా ప్రత్యేకమైన రైళ్లను వేయడం ద్వారా ఈ మహమ్మారి కాలంలోనే అత్యంత భారీ స్థాయిలో జరిగిన ప్రజా రవాణా గా ఇది ప్రపంచ చరిత్రలో నిలబడిపోతుందని ఆయన అన్నారు. ఇలా రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖకు, హోమ్ మంత్రిత్వ శాఖకు, ప్రత్యేకించి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 

ఇకపోతే... దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఆగే సూచనలు కనపించడం లేదు. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 2,293 కేసులు కొత్తగా బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 37,336కు చేరుకుంది. గత 24 గంటల్లో 71 మంది కోవిడ్ -19తో మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1218కి చేరుకుంది. 

ఇప్పటి వరకు దేశంలో 9951 మంది కరోనా వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 26,167 ఉంది. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 

మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 11,506కు చేరుకుంది. మహారాష్ట్రలో 485 మంది కరోనా వైరస్ తో మృత్యువాత పడ్డారు.

PREV
click me!

Recommended Stories

West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్ | Asianet Telugu
PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu