సీబీఐ అంతర్యుద్ధం : మోడీ చర్యలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసలు

Published : Oct 24, 2018, 01:19 PM ISTUpdated : Oct 24, 2018, 03:09 PM IST
సీబీఐ అంతర్యుద్ధం : మోడీ చర్యలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసలు

సారాంశం

సీబీఐ ఉన్నతాధికారుల అంతర్యుద్ధంలో  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం  నిష్పక్షపాతంగా వ్యవహరించిందని రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు.


న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారుల అంతర్యుద్ధంలో  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం  నిష్పక్షపాతంగా వ్యవహరించిందని రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీబీఐ పరిణామాలపై తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు.  ఈ వివాదంలో  మోడీ ప్రభుత్వం నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించిందన్నారుపోలీసు శాఖలో అవినీతి ప్రబలిందనే విషయం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు.

  సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య అంతర్యుద్ధం కారణంగా  ఈ ఇద్దరు అధికారులను సెలవుపై వెళ్లాలని మోడీ ఆదేశించారు. అంతేకాదు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా ఎం. నాగేశ్వరరావును నియమించిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే