ముద్దుతో కరోనాను మాయం చేస్తానని చెప్పిన కిస్సింగ్ బాబా.... కరోనాకే చివరకు ఖతమయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రత్లాం నగరంలో చోటు చేసుకొంది.
భోపాల్ : ముద్దుతో కరోనాను మాయం చేస్తానని చెప్పిన కిస్సింగ్ బాబా.... కరోనాకే చివరకు ఖతమయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రత్లాం నగరంలో చోటు చేసుకొంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం నగరానికి చెందిన అస్లాం బాబాకు కిస్సింగ్ బాబాగా పేరుంది. భక్తుల చేతులపై ముద్దు పెడితే రోగాలు నయమౌతాయని నమ్ముతారు.ఎలాంటి రోగమైన ఆయన ముద్దు పెట్టుకొంటే నయమౌతోందనే నమ్మే భక్తులు ఆయన వద్దకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
తన వద్దకు వచ్చే భక్తుల చేతులపై ముద్దులు పెడితే అవి నయమౌతాయని ఆ బాబా భక్తులకు చెప్పేవాడు. కరోనా నేపథ్యంలో తన వద్దకు కరోనా రోగులు వస్తే వారి చేతులపై ముద్దులు పెట్టి కరోనాను కూడ నయం చేస్తానని ఆయన ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కరోనా వచ్చినా భక్తులు ఆయన దగ్గరకు వెళ్లేవారు. ఆయన కూడా తాను చేతులపై ముద్దుపెట్టుకుంటే కరోనా నయం అవుతుందని ప్రచారం చేసుకున్నాడు.కరోనా వైరస్ సోకిన భక్తులు బాబా వద్దకు వచ్చారు.
బాబా కరోనా సోకిన రోగుల చేతులకు ముద్దులు పెట్టాడు. దీంతో ఆయనకు కరోనా సోకింది. బాబా చేత ముద్దులు పెట్టించుకొన్న 24 మందికి కూడ కరోనా సోకింది. కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అస్లాం బాబా ఈ నెల 4వ తేదీన మరణించారు. కరోనాతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 10 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో 400 మంది మరణించారు.