కరోనా ఎఫెక్ట్: చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌పై బీహార్‌లో కేసు

By narsimha lode  |  First Published Jun 12, 2020, 3:22 PM IST

బీహార్ కోర్టులో చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ పై కేసు నమోదైంది. న్యాయవాది మురద్ అలీ ఫిర్యాదు మేరకు బీహార్ రాష్ట్రంలోని వెస్ట్ చంపరన్ జిల్లాలోని బె చీఫ్ జ్యూడీషీయల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది.


పాట్నా: బీహార్ కోర్టులో చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ పై కేసు నమోదైంది. న్యాయవాది మురద్ అలీ ఫిర్యాదు మేరకు బీహార్ రాష్ట్రంలోని వెస్ట్ చంపరన్ జిల్లాలోని బె చీఫ్ జ్యూడీషీయల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది.

Latest Videos

చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్  తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్  చైనాలోని వుహాన్ నుండి కరోనా వైరస్ ను ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందేలా ప్రయత్నించారని ఆరోపించారు.

also read:కరోనా రోగులను జంతువుల కంటే హీనంగా చూస్తారా?: కేజ్రీ సర్కార్‌పై సుప్రీం ఫైర్

ఈ కేసుపై విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.ఈ కేసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లను సాక్షులుగా న్యాయవాది పేర్కొన్నారు.

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ను వ్యాప్తి చెందేలా చేయడంలో చైనా అధ్యక్షుడు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ ఆరోపించారు.చైనా అధ్యక్షుడితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ కూడ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.

సెక్షన్ 269, 270,271, 302, 307,500,504, 120 బీ ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. తన ఆరోపణలకు సోషల్ మీడియాతో పాటు , ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు.

click me!