ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు... ఏడ్చాడని కన్నబిడ్డనే...

Published : Aug 07, 2019, 08:45 AM IST
ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు... ఏడ్చాడని కన్నబిడ్డనే...

సారాంశం

వడకాశి, స్వామినాథన్ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో... ఆమె బిడ్డ ఆకలితో ఏడ్చాడు.దీంతో కోపంతో ఊగిపోయిన వడాకాశి, స్వామినాథన్... బిడ్డను అతి దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన ఆ బిడ్డ అక్కడికక్కడే కన్నుమూశాడు. 

భర్తను కాదని వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి అడ్డుగా ఉన్నాడని కడుపున పుట్టిన బిడ్డను చంపేసింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తిరువేంకటమ్ తాలుకా పళంగోటైకి చెందిన భాగ్యమ్ కుమారుడు రాజ్(45) విద్యుత్ శాఖ కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య వడకాశి(35) సంవత్సరన వయసుగల కొడుకు ఉన్నాడు. కాగా... వడకాశికి ఇటీవల తమ ఇంటికి పాలు పోసే స్వామినాథన్(32) తో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న రాజ్ ఇద్దరినీ పలు మార్లు మందలించాడు. అయినా వారిలో మార్పు మాత్రం రాలేదు. వారి వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఇటీవల వడకాశి, స్వామినాథన్ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో... ఆమె బిడ్డ ఆకలితో ఏడ్చాడు.

దీంతో కోపంతో ఊగిపోయిన వడాకాశి, స్వామినాథన్... బిడ్డను అతి దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన ఆ బిడ్డ అక్కడికక్కడే కన్నుమూశాడు. కాగా... మేడపై నుంచి జారి కిందపడ్డాడని... అందుకే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేయడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు