ఎంత పని చేశావ్ తల్లి.. చిన్నారులని కూడా చూడకుండా ఐదుగురు పిల్లలను వెంట తీసుకెళ్లి..

By team teluguFirst Published Dec 5, 2021, 5:13 PM IST
Highlights

ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లను బావిలోకి తోసేసి తాను కూడా ఆత్మహత్య (Mother jumped into the well with 5 daughters) చేసుకుంది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి ఆరు మృతదేహాలను బయటకు తీశారు. 
 

ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లను బావిలోకి తోసేసి తాను కూడా ఆత్మహత్య (Mother jumped into the well with 5 daughters) చేసుకుంది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి ఆరు మృతదేహాలను బయటకు తీశారు.  ఈ విషాద ఘటన రాజస్తాన్‌లోని (Rajasthan) కోటా జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటా జిల్లాలోని రామగంజ్‌మండి ప్రాంతలో చెచత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలియాఖేడి గ్రామంలో బంజరాలు నివాసం ఉంటారు. శివలాల్ అనే వ్యక్తి కూడా అక్కడే నివాసం ఉంటుంది. అతనికి బాదమ్ దేవితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఏడుగురు పిల్లలు ఉన్నారు. 

అయితే కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శివలాల్ భార్య బాదమ్ దేవి తన ఐదుగురు కూతుళ్లను వెంటన తీసుకెళ్లి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లితో సహా ఐదురు కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో బాదమ్ దేవితో పాటు ఆమె కూతుళ్లు.. సావిత్రి(14), అంజలి (8), కాజల్ (6), గుంజన్ (4), అర్చన (1) ఉన్నారు. అయితే బాదమ్ దేవి ఐదుగురు పిల్లతో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన సమయంలో.. 15 ఏళ్ల గాయత్రి, 7 ఏళ్ల పూనమ్ ఇంటి బయట ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం బావిలో మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

Also read: తమిళనాడులో దారుణం... ప్రియుడిపైనే యువతి యాసిడ్ దాడి... కత్తితో పొడిచి హత్యాయత్నం

దీంతో రామ్‌గంజ్ మండి డిప్యూటీ ఎస్పీ ప్రవీణ్ నాయక్, సీఐ రాజేంద్ర ప్రసాద్.. ఇతర అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవని.. అందుకే బాదమ్ దేవి ఇలా చేసి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి శివలాల్ మాట్లాడుతూ.. తాను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టుగా చెప్పాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరగి రాలేదని తెలిపాడు. రాత్రి తన భార్య ఆత్మహత్య యత్నం చేసిందని అన్నారు. డిప్యూటీ ఎస్పీ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధకరమైనది అని అన్నారు. ఇందుకు గల కారణాలపై విచారణ జరుగుతుందని చెప్పారు. భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరిగినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. 

click me!