
భువనేశ్వర్ : Property dispute నేపథ్యంలో తల్లీకొడుకులు House arrestకి గురైన అమానవీయ సంఘటన స్థానిక పిర్ పి ఛక్ ప్రియదర్శిని మార్కెట్ దగ్గర సంచలనం రేకెత్తించింది. వారం రోజులుగా 76యేళ్ల వృద్ధురాలు అనసూయ మహంతి, ఆమె కొడుకు ఇంట్లో గృహనిర్భంధంలో ఉండడం చూసి, చుట్టుపక్కల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వారిని చూసేందుకు జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో ఆ ఏరియా రద్దీగా మారింది. దీంతో పోలీసులు అక్కడ Section 144 విధించి, చర్యలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెడితే.. కైలాస్ చంద్రమహంతి (లేట్) తొలి భార్య అనసూయ మహంతి. దాదాపు 20 యేళ్ల నుంచి ఈమె భర్త నుంచి వేరుగా కొడుకుతో కలిసి ఉంటోంది.
ఈ క్రమంలో కైలాస్ మహంతి రెండో భార్యతో కలిసి ఇంట్లోనే ఉండేవాడు. ఇటీవల ఆయన చనిపోయారు. భర్త తదనంతరం ఆస్తి మీద హక్కు కోసం అనసూయ మహంతి కోర్టుని ఆశ్రయించింది. 2021 అక్టోబర్ లో స్థానిక దిగువ కోర్టుకు ఈమెకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ రెండో భార్య ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఇది విచారణ దశలో ఉండగా, తుది తీర్పు వెలువడేంతవరకు యథాతథ స్థితి కొనసాగుతుందని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి మరీ మొదటి భార్య కొడుకుతో కలిసి భర్త ఉంటున్న ఇంట్లోకి చొరబడడంతో కైలాస్ మహంతి రెండో భార్య ఇంటి గేటు తలుపులకు తాళం వేసింది. దీంతో వారం రోజులుగా వారు అదే ఇంట్లో బంధీలుగా ఉన్నారు.
న్యాయస్థానం పరిధిలో వీరి వివాదం ఉన్నందున శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు తాళాలు తీసి, తమకు స్వేచ్ఛ కల్పించాలని బాధితులు అభ్యర్థిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ హైటెక్ యుగంలో కూడా witchcraft నమ్మి ఒక boyని హత్య చేశారు. నిందితులు కూడా మైనర్ బాలలే కావడం గమనార్హం. State of Karnatakaలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. హతుడు హెమ్మరగాల గ్రామానికి చెందిన సిద్ధరాజు కుమారుడు మహేష్ 16. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ధనుర్మాసం అమావాస్య కావడంతో పని ఉంది అని చెప్పి మహేష్ ను తీసుకుని, ముగ్గురు స్నేహితులు పట్టణంలోని ఒక చెరువు వద్దకు వచ్చారు.
నిందితుల్లో ఒకడు తను తన తాత దగ్గర చేతబడిలో శిక్షణ పొందానని తెలిపాడు. అది చూపిస్తానని చెప్పి.. అక్కడికక్కడే అతను ఒక బొమ్మను తయారు చేసి దానికి మహేష్ అని పేరు పెట్టారు. ముగ్గు వేసి పూజలు చేశారు. మహేష్ ను చెరువులో ముంచి చంపి వెళ్ళిపోయారు. మహేష్ చెరువు లో ఈత కొడుతూ మునిగిపోయాడు అని ప్రచారం చేశారు. దీంతో గ్రామస్తులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ పరిశీలించగా.. చెరువు దగ్గర చేతబడి సామాగ్రి కనిపించింది. నంజనగూడు పోలీసులు ఆరా తీసి ముగ్గురు మైనర్ బాలులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.