వ్యాపారవేత్తకు వల వేసిన వివాహిత.. నగ్నంగా ఫోటోలు తీసి..

Published : Mar 08, 2021, 09:44 AM IST
వ్యాపారవేత్తకు వల వేసిన వివాహిత.. నగ్నంగా ఫోటోలు తీసి..

సారాంశం

స్పృహ కోల్పోయిన సదరు వ్యాపారిని నగ్నంగా ఫోటోలు తీసి.. ఆ తర్వాత అతనిని బెదిరించి డబ్బులు గుంజింది. ఈ ప్లాన్ అంతా.. సదరు మహిళ ఆమె కొడుకుతో కలిసి చేయడం గమనార్హం.

ఓ వ్యాపారవేత్తకు వివాహిత వల వేసింది. ఎదురింట్లో ఉంటూ పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానించి మత్తు మందు కలిపిన టీ తాగించింది. స్పృహ కోల్పోయిన సదరు వ్యాపారిని నగ్నంగా ఫోటోలు తీసి.. ఆ తర్వాత అతనిని బెదిరించి డబ్బులు గుంజింది. ఈ ప్లాన్ అంతా.. సదరు మహిళ ఆమె కొడుకుతో కలిసి చేయడం గమనార్హం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొప్పళ్ లో స్టీల్ కంపెనీ పెట్టిన ఓ వ్యాపారవేత్త హొస్పేటలోని ఎంజే నగర 6వ క్రాస్‌లో  కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎదురుగా ఉన్న ఇంటిలో గీతా అనే మహిళ నివాసం ఉంటోంది. 2019 మార్చిలో  వ్యాపారవేత్తకు, గీతకు మధ్య పరిచయం ఏర్పడింది. ఒక రోజు  ఆయన్ను గీతా తన ఇంటికి ఆహ్వానించి తేనీరు ఇచ్చింది. దీంతో ఆయన మూర్ఛబోయాడు.


గంట తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత గీతా ఫోన్‌ చేసి నీ నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, రూ.30 లక్షల ఇచ్చి సీడీ తీసుకెళ్లాలని సూచించింది. దీంతో ఆయన  గీతా బ్యాంకు ఖాతాకు రూ.15లక్షలు జమ చేశాడు. మిగితా డబ్బు కోసం గీతా ఒత్తిడి చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు  పోలీసులు గీతా ఇంటిలో తనిఖీలు  నిర్వహించగా 2.750 గ్రాముల గంజాయి లభించింది.  గీతాతో పాటు ఆమెకు సహకరించిన కుమారుడు విష్ణును అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచినట్లు సీఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu