కాఫీ తాగి తల్లీకూతుళ్లు మృతి... అంతుచిక్కని కారణం

sivanagaprasad kodati |  
Published : Jan 20, 2019, 12:33 PM IST
కాఫీ తాగి తల్లీకూతుళ్లు మృతి... అంతుచిక్కని కారణం

సారాంశం

చలికాలం వేడి వేడి కాఫీ తాగుతూ ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటే ఆ మజానే వేరు కదా.. అయితే కాఫీ తాగి తల్లీకూతుళ్లు మరణించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకా చేళూరు హోబలి బత్తలపల్లి గ్రామానికి చెందిన అక్కలమ్మ, తన కుమార్తె నరసమ్మ, మనవడు అరవింద్, మనవరాలు ఆరతిలు ఇంట్లో కాఫీ చేసుకుని తాగారు. కాఫీ సేవించిన కాసేపటికే నలుగురూ వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

చలికాలం వేడి వేడి కాఫీ తాగుతూ ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటే ఆ మజానే వేరు కదా.. అయితే కాఫీ తాగి తల్లీకూతుళ్లు మరణించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకా చేళూరు హోబలి బత్తలపల్లి గ్రామానికి చెందిన అక్కలమ్మ, తన కుమార్తె నరసమ్మ, మనవడు అరవింద్, మనవరాలు ఆరతిలు ఇంట్లో కాఫీ చేసుకుని తాగారు.

కాఫీ సేవించిన కాసేపటికే నలుగురూ వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వీరిని హుటాహుటిన కోలారులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్కలమ్మ, నరసమ్మలు మరణించారు.

మిగతా ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం దేవరాజ అరసు మెడికల్ కాలేజీకి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాఫీలో ఎవరైనా విషం కలిపారా..? లేదా మరేదైనా కోణం ఉందా అన్న దిశగా ఖాకీలు ఆరా తీస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్