తాను పోతే దిక్కులేనివాళ్లు అవుతారని....కుటుంబం మొత్తాన్ని

sivanagaprasad kodati |  
Published : Jan 20, 2019, 10:53 AM IST
తాను పోతే దిక్కులేనివాళ్లు అవుతారని....కుటుంబం మొత్తాన్ని

సారాంశం

ఒక ఇంటిపెద్దకు సోకిన అనారోగ్యం కుటుంబం మొత్తాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా అమలినగర్‌లో ఆరోగ్యరాజ్ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. 

ఒక ఇంటిపెద్దకు సోకిన అనారోగ్యం కుటుంబం మొత్తాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా అమలినగర్‌లో ఆరోగ్యరాజ్ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.  ఈ క్రమంలో వారి ఇంటి తలుపులు శనివారం సాయంత్రం వరకు తెరచుకోలేదు.

దీనిని గమనించిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టగా ఆరోగ్యరాజ్ బెడ్‌రూమ్‌లో ఉరికి వేలాడుతూ కనిపించాడు. పక్కనే భార్య శోభన, కుమారుడు రితిక్, కుమార్తె రియా, శోభన తల్లి భువనేశ్వరి మంచాలపై విగతజీవులుగా పడివుండటాన్ని గుర్తించారు.

ఆరోగ్యరాజ్‌ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చాలారోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తాను చనిపోతే భార్యాపిల్లలు దిక్కులేనివారవుతారని లోలోపల కుమిలిపోయిన ఆరోగ్యరాజ్ తాను ఆత్మహత్య చేసుకోవడంతో పాటు భార్యాపిల్లల్ని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు.

దీనిలో భాగంగా తాను ఉరివేసుకోవడానికి ముందే కుటుంబసభ్యులకు విషమిచ్చినట్లు లేఖలో పేర్కొన్నాడు. ఐదుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Budget Friendly Cars : కొత్తగా జాబ్ లో చేరినవారు కూడా కొనగలిగే టాప్ 5 కార్లు ఇవే..
Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu