ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్...

By AN TeluguFirst Published Nov 25, 2021, 10:51 AM IST
Highlights

ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో Factory premisesలోని వాటర్ ట్యాంక్ దగ్గర బాలిక తన ముగ్గురు తోబుట్టువులతో ఆడుకుంటుంది. ఆ తరువాత కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని తీసుకువెళ్లేప్పుడు అరవకుండా నోటిని గట్టిగా మూసి లాక్కెళ్లారని తేలింది. 

మంగళూరు : మంగళూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టైల్స్ ఫ్యాక్టరీలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో పోలీసులు మంగళవారం సాయంత్రం నలుగురు కూలీలను అరెస్టు చేశారు. చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఆరోపణలపై నిందితుల కోసం  40 మంది పోలీసులు.. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టారు. 

ఈ నిందితుల్లో ముగ్గురు - జైబన్ అకా జే సింగ్ (21), ముఖేష్ సింగ్, (20), మధ్యప్రదేశ్ కు చెందినవారు కాగా, మనీష్ తిర్కి (33) జార్ఖండ్‌కు చెందినవాడు. వీరు ముగ్గురూ అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరితో పాటు నాలుగో నిందితుడు madhyapradeshకి చెందిన మునీమ్ సింగ్ (20), పుత్తూరులో కూలీగా పనిచేస్తున్నాడు. జార్ఖండ్‌కు చెందిన girl child తల్లిదండ్రులు కూడా గత రెండేళ్లుగా అదే ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారని పోలీసు చీఫ్ ఎన్ శశికుమార్ బుధవారం తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో Factory premisesలోని వాటర్ ట్యాంక్ దగ్గర బాలిక తన ముగ్గురు తోబుట్టువులతో ఆడుకుంటుంది. ఆ తరువాత కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని తీసుకువెళ్లేప్పుడు అరవకుండా నోటిని గట్టిగా మూసి లాక్కెళ్లారని తేలింది. ఆ తరువాత ఆ చిన్నారిపై నలుగురు అత్యంత పాశవికంగా ఒకరి తరువాత ఒకరు వంతులవారీగా Sexual harassmentకు పాల్పడ్డారు.

దానికి ఆ బాలిక తట్టుకోలేక, తీవ్ర రక్తస్రావం కావడం,  నొప్పిని తట్టుకోలేక కేకలు వేయడం ప్రారంభించడంతో, నిందితులు సంఘటన వెలుగులోకి వస్తుందని భయపడ్డారు. దీంతో అరవద్దని జైబన్ ఆమెను గట్టిగా తోసేశాడు. అప్పటికీ చిన్నారి శబ్దాలు ఆపకపోవడంతో... ఆ తరువాత అతను, మునీమ్ కలిసి ఆమెను రెండు అడుగుల లోతైన drainలో పడవేసారు.

అప్పటికే పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతుకుతుండడంతో.. ఇరుగుపొరుగు వాళ్లు, మాజీ కూలీ అయిన విశ్వనాథ్ సాయంత్రం 6 గంటల సమయంలో కాలువలో బాలికను చూశారు, అయితే ఆమె అప్పటికే చనిపోయింది. బాలిక కోసం వారి అన్వేషణ విషాదాంతం అవ్వడంతో, ఆమె తల్లిదండ్రులు న్యాయస్థానం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ వెన్‌లాక్ ఆసుపత్రిలో నిర్వహించిన postmortemలో ప్రాథమిక ఫలితాల్లో బాలిక మీద throttling జరిగిందని.. నోట్లో గాయాలు, గుద మార్గంలో, యోని ప్రాంతంలో లైంగిక దాడి జరిగిందని దీనివల్ల అధిక రక్తస్రావం జరిగినట్లు నిర్ధారించినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు.

ఈ కేసును ఛేదించేందుకు ఇద్దరు డీసీపీలు, నలుగురు ఏసీపీలు సహా దాదాపు 40 మంది సిబ్బందితో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ బృందాలు గంటల తరబడి CCTV ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు పరిశీలించారు. 20 మందికి పైగా వ్యక్తుల స్టేట్‌మెంట్‌లను తీసుకున్నారు, ప్రధానంగా tile factory సిబ్బంది, కార్మికులను విచారించారు.

అపహరణ సమయంలో చిన్నారితో ఆడుకుంటున్న చిన్నారుల వాంగ్మూలంతో సహా సాంకేతిక, సందర్భోచిత సాక్ష్యాధారాల ఆధారంగా మంగళవారం సాయంత్రం పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మంగళూరు నుండి, ఇద్దరు పుత్తూరు నుండి వచ్చినవారని తేలింది. మంగళవారం సాయంత్రం... ఘటన జరిగిన వెంటనే కూలీలను విచారణ నిమిత్తం సముదాయ భవన్‌కు తరలించారు. నిందితులను బుధవారం మంగళూరులోని కోర్టులో హాజరుపరిచారు.

అడవిలో అస్థిపంజరం.. ఎవరిదని ఆరాతీస్తే.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

మనీష్ తిర్కీ 11 నెలల క్రితం టైల్స్ ఫ్యాక్టరీలో చేరాడని, మూడు నెలల క్రితం జైబన్, ముఖేష్ సింగ్ వచ్చారని పోలీసులు తెలిపారు. పుత్తూరుకు చెందిన మునీమ్ ఘటనకు ఒకరోజు ముందు ముగ్గురు నిందితులను కలిసేందుకు వచ్చాడు. కుటుంబంతో ఉండేవారికి, బ్యాచిలర్లైన కార్మికుల కోసం ప్రత్యేక వసతి కల్పించినట్లు ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి.

జైబన్, మనీష్ ఎక్కువగా ఒకే గదిలో ఉండేవారు. వీరి కన్ను బాలిక మీద పడింది. వారు బాలికను చాక్లెట్ ఆశ చూపో, డబ్బుల ఆశచూపో రప్పించారని, గతంలో కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విచారణలో వెల్లడయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు ఉన్న ఆ ప్రాంతం సిసిటివి కవరేజ్ లో లేదని గుర్తించిన తరువాత తమ అఘాయిత్యానికి ఆ స్థలాన్ని ఎంచుకున్నారు. 

దీంతోపాటు ఆదివారం పూట కర్మాగారం ఆవరణలో కార్మికుల కదలికలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దాడి తర్వాత, మునీమ్, ముఖేష్ పుత్తూరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన ఇద్దరు మాత్రం ఫ్యాక్టరీ వద్దే ఉండి, అమ్మాయిని వెతకడంలో సహాయం కూడా చేశారు. కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినందుకు గాను ఏసీపీ (సౌత్ సబ్ డివిజన్) రంజిత్ కుమార్ భండారుకు పోలీస్ కమిషనర్ రూ.25 వేల నగదు రివార్డును అందజేశారు.

click me!