పార్లమెంట్‌పై ఉగ్రదాడి: తృటిలో తప్పించుకొన్న వాజ్‌పేయ్, అద్వానీ

By narsimha lodeFirst Published Aug 16, 2018, 6:20 PM IST
Highlights

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్‌తో పాటు, అద్వానీ  పలు పార్టీల అగ్రనేతలు, మంత్రులు, ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్న సమయంలోనే  పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రమూకలు నకిలీ గుర్తింపు కార్డులతో పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డారు.

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్‌తో పాటు, అద్వానీ  పలు పార్టీల అగ్రనేతలు, మంత్రులు, ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్న సమయంలోనే  పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రమూకలు నకిలీ గుర్తింపు కార్డులతో పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డారు.

2001 డిసెంబర్ 13 వతేదీన  కొందరు ఉగ్రవాదులు మీడియా వాహనంలో నకిలీ గుర్తింపులతో పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించారు.  భద్రతా దళాలలపై కాల్పులు జరుపుతూ పార్లమెంట్‌లోకి వెళ్లి ప్రధాని సహా పలువురిని మట్టుబెట్టాలని ప్లాన్ చేశారు.  అెమెరికాలో ఉగ్రవాదులు సెప్టెంబర్ దాడులకు పాల్పడిన మూడు మాసాలకే ఈ ఘటన చోటు చేసుకొంది.

అయితే పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడికి పాక్‌లోనే కుట్ర జరిగిందని భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

పార్లమెంట్‌పై  దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను భారత  భద్రతా దళాలు  హతమార్చాయి. ఉగ్రమూకల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు  ఒక సీఆర్పీఎఫ్ మహిళ, ఇద్దరు పార్లమెంట్ భద్రతా సిబ్బంది , ఒక తోటమాలి చనిపోయారు.

ఈ దాడికయి ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్ సూత్రధారిగా సుప్రీంకోర్టు నిర్ధారించి ఉరిశిక్షను విధించింది.  ఈ దాడితో భారత, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. 2001-02 మధ్య కాలంలో సరిహద్దుల్లో  సైనిక బలగాలను మోహరించారు. 

అఫ్జల్ గురుకు 20006  అక్టోబర్ 20న ఉరి తీయాల్సి ఉండగా.. అతడు రాష్ట్రపతికి క్షమాభిక్ష వినతిపత్రం సమర్పించారు. అయితే అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రకటిస్తే  పార్లమెంట్ పై దాడి సమయంలో వీరమరణం పొందిన కమలేష్ కుమారి యాదవ్ కుటుంబసభ్యులు ఆశోకచక్రను వాపస్ ఇస్తామని ప్రకటించారు. 2013 ఫిబ్రవరి3న అఫ్జల్ గురు క్షమాభిక్షపై అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. 2013 ఫిబ్రవరి 9న, అఫ్జల్ గురును తీహార్ జైల్లో ఉరి తీశారు.

click me!