
స్టార్టప్‌ల ప్రపంచంలో భారతదేశం ఇతర దేశాలకు పోటీనిస్తూ.. వర్డల్ ఛాంపియన్ గా నిలుస్తుందని కేంద్ర సహాయక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. బెంగుళూరులో జరిగిన G20-డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మట్లాడుతూ... భారతదేశ స్టార్టప్ ప్రాముఖ్యత, ఓపెన్ సోర్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లను హైలైట్ చేశారు. 29 దేశాల నుండి స్టార్టప్‌లు సమీకరించినందున ప్రపంచ ఆవిష్కరణలలో భారతదేశానికి ప్రత్యేక స్థాన్థం ఉందని అన్నారు. డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ చర్చలు మౌలిక సదుపాయాలు, భద్రత, నైపుణ్యాభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపారు.
5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్
కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీని కారణంగా.. గ్లోబల్ ఫోరమ్‌లలో భారతదేశానికి గుర్తింపు లభించిందనీ, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల రంగంలో భారతదేశం ఉన్నత పురోగతిని సాధించిందని తెలిపారు. భారతదేశం డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ G20లో భాగంగా ఇప్పటివరకు 3 సమావేశాలను నిర్వహించారు. ఈ నాలుగో సమావేశం బెంగళూరులో జరుగుతోంది. డిజిటల్ ఇండియా కోసం ప్రధాని మోదీ చేస్తున్న క్రుషిని కేంద్ర మంత్రి వివరించారు.
ప్రపంచ ఛాంపియన్‌గా భారత్
నేడు భారత్ దేశంలోని 120 స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలతో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. స్టార్టప్ వర్డల్ లో భారత్ అత్యధిక వాటాను కలిగి ఉందని, భారత్ స్టార్టప్‌ల ప్రపంచ ఛాంపియన్‌గా చూడబడటానికి ఇదే కారణమని తెలిపారు. ప్రధాని మోదీ దీనిని సాంకేతిక లేదా సాంకేతిక అవకాశాల దశాబ్దంగా కూడా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉన్న యువత సృజనాత్మకత, దృఢ సంకల్పం, శక్తితో ఇండియా టేకెన్‌కు ఊతమిస్తుందని చెప్పారు.
ఇది మోడీ ప్రభుత్వ విధానాల ఫలితం - రాజీవ్ చంద్రశేఖర్
ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని విధానాల అభినందిస్తూ.. భారతదేశ డిజిటల్ పరివర్తనకు ఇది అద్భుతమైన ఉదాహరణ అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన రూ.100లో కేవలం రూ.15 మాత్రమే నిజమైన లబ్ధిదారుడికి చేరేదనీ, మిగిలిన 85 రూపాయలు మధ్య దళారులకు చేరేదని తెలిపారు. కానీ, మోడీ ప్రభుత్వంలో ఆ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతోందని, డిజిటల్ విప్లవం వల్లే ఇదంతా సాధ్యమైందని, ప్రజలకు నేరుగా డబ్బులు చేరుతున్నాయన్నారు.