భారత్ లో కరోనా.. ఒక్క రోజులో 23వేల కేసులు, 18 వేలు దాటిన మరణాలు

By telugu news teamFirst Published Jul 4, 2020, 11:38 AM IST
Highlights

దీంతో గత 24 గంటల్లో భార‌త్‌ లో న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 ల‌క్షల‌ యాభై వేలుకు చేరువయింది.

భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఊహించని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి.  రోజు రోజుకీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కూడా భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగాయి. నిన్న దాదాపు 23వేల కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ 20వేల కేసులు నమోదౌతుండటం గమనార్హం. ఈ కేసులు పెరుగుతుండటం ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. 

 కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 22,771 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇదే స‌మ‌యంలో 442 మంది క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందారు. దీంతో గత 24 గంటల్లో భార‌త్‌ లో న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 ల‌క్షల‌ యాభై వేలుకు చేరువయింది.

తాజా కేసులతో పాజిటివ్ కేసులు 6,48,315కు చేర‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన‌వారి సంఖ్య 18,655కు పెరిగింది.. ఇక‌, ప్ర‌స్తుతం 2,35,433 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతుండ‌గా 3,94,226 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,42,383 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.  అందులో కేవలం 22,771 కేసులు మాత్రమే పాజిటివ్ గా తేలాయి. కాగా.. ఇప్పటి వరకు 95లక్షల మందికి భారత్ లో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 95,40,132 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగగా అందులో 6,48,315 కేసులు పాజిటివ్ అయ్యాయి.  

click me!