అయోధ్యకు వందకు పైగా విమానాలు రానున్నాయి. యూపీలోని ఐదు విమానాశ్రయాల్లో వీఐపీల విమానాల ల్యాండింగ్, పార్కింగ్‌ల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ విమానం నేరుగా అయోధ్యలోని మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది.
Ram Mandhir : అయోధ్య మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణ భక్తులు మొదలు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సెలెబ్రిటీలు, పలురంగాల్లోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం దేశంలోని పలు ప్రాంతాల నుంచి నేరుగా అయోధ్య ఎయిర్‌పోర్టుకు 100కు పైగా విమానాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే 45కు పైగా విమానాలు అయోధ్యలోని వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి క్లియరెన్స్ తీసుకున్నాయి. వీటి సంఖ్య పెరుగుతున్నది.
ఇక లక్నో ఎయిర్‌పోర్టులో 600కు పైగా వీఐపీలు విమానాల ద్వారా ల్యాండ్ కాబోతున్నారు. ఇక్కడి నుంచి వారు రోడ్డు మార్గంలో అయోధ్యకు చేరుకుంటారు. 22న కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానం మాత్రమే మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్‌లో ఉంటుంది. మిగిలిన విమానాలు అన్నీ వారణాసి, లక్నో, ప్రయాగ్ రాజ్, కుషీనగర్, ఆజంగఢ్ ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ పార్కింగ్‌లో ఉంటాయి.
Also Read: NTR: వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా.. : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంపై కొడాలి నాని
విదేశాల నుంచి వచ్చేవారు.. :
అయోధ్య విమానాశ్రయంలో కేవంల 8 విమానాలు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు మాత్రమే ఉన్నది. కాబట్టి, వేరే దేశాధినేతలు గనుక విమానంలో అయోధ్యకు వచ్చే అవకాశం ఉన్నది. వారి విమనాలు కూడా అక్కడ పార్కింగ్ చేయబడతాయి. ఇక విదేశాల నుంచి వచ్చే చార్టర్డ్ ఫ్లైట్లు లక్నో, వారణాసి విమానాశ్రయాల్లో ల్యాండ్ అవుతాయి. ఇక్కడి నుంచి ట్యాక్సీల్లో అయోధ్యకు వెళ్లాల్సి ఉంటుంది.
విమానాల పార్కింగ్ :
పెద్ద మొత్తంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున విమానాల పార్కింగ్ కోసం కూడా అధికారులు దృష్టి సారించారు. అయోధ్య ఎయిర్‌పోర్టుతోపాటు లక్నో, వారణాసి ఎయిర్‌పోర్టులనూ సిద్ధం చేస్తున్నారు. కుషీనగర్, ఆజంగఢ్ ఎయిర్‌పోర్టుల్లో విమానాలను నిలపడానికి యోచనలు చేస్తున్నారు.
Also Read : Viral: సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న యువకుడు కోచింగ్ క్లాస్‌లోనే హఠాన్మరణం
21వ, 22వ తేదీల్లో 36 మంది ప్రముఖులు చార్టర్డ్ ఫ్లైట్‌లో లక్నోకు చేరుకునే అవకాశం ఉన్నది. ఒక అంచనా ప్రకారం 600 మందికి పైగా భక్తులు లక్నోకు ఫ్లైట్‌లలో చేరుకోనున్నారు. ఇందులో బాలీవుడ్ సెలెబ్రిటీలు మొదలై పలురంగాల్లో ప్రముఖులు ఉంటారు. ఇక్కడి నుంచి వారు ట్యాక్సీల్లో అయోధ్యకు వెళ్లుతారు. ఇదే అదునుగా చూసి ట్యాక్సీ డ్రైవర్లు చార్జీలు పెంచితే చర్యలు తీసుకోరాదని లక్నో ఆర్టీఓ ఇది వరకే ఆదేశాలు జారీ చేసింది.