మ‌రో 48 గంట‌ల్లో ద‌క్షిణ భార‌త రాష్ట్రాల‌కు రుతుప‌వ‌నాలు..

By Mahesh RajamoniFirst Published Jun 9, 2023, 12:57 AM IST
Highlights

New Delhi: రానున్న 48 గంటల్లో రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటక, ఈశాన్య ప్రాంతాలకు రానున్నాయి. నైరుతి రుతుపవనాలు గురువారం భారతదేశాన్ని తాకాయి. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జూన్ 1న రుతుప‌వ‌నాలు కేర‌ళ‌కు చేరుకుంటాయి. అయితే, ఈ ఏడాది వారం ఆల‌స్యంగా రుతుప‌వ‌నాలు కేర‌ళాను తాకాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
 

Monsoon: రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. రానున్న 48 గంటల్లో రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటక, ఈశాన్య ప్రాంతాలకు రానున్నాయి. "నైరుతి రుతుపవనాలు గురువారం భారతదేశాన్ని తాకాయి. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జూన్ 1న రుతుప‌వ‌నాలు కేర‌ళ‌కు చేరుకుంటాయి. అయితే, ఈ ఏడాది వారం ఆల‌స్యంగా రుతుప‌వ‌నాలు కేర‌ళాను తాకాయ‌ని" భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

వివరాల్లోకెళ్తే.. రానున్న 48 గంటల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. నైరుతి రుతుపవనాలు గురువారం భారతదేశాన్ని తాకాయి. ప్రతియేడాది జూన్1న రుతుపవనాలు భారత్ లోకి ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది వారం ఆల‌స్యంగా కేర‌ళ‌ను చేరుకున్నాయ‌ని ఐఎండీ తెలిపింది. దేశంలో రుతుపవనాల పురోగతిపై ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గురువారం ఏఎన్ఐతో మాట్లాడుతూ.. నైరుతి రుతుపవనాలు నేడు కేరళకు చేరుకున్నాయని తెలిపారు. "రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళకు చేరుకుంటాయి, కానీ ఈసారి జూన్ 8 న వచ్చాయి. ఏడు రోజుల జాప్యం జరిగింది. కేరళలో రెండు రోజులుగా మంచి వర్షాలు కురిశాయనీ, దక్షిణ తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని" తెలిపారు.

రానున్న 48 గంటల్లో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నానీ. ఇది కాకుండా, కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుప‌వ‌నాలు చేరుకుంటాయ‌ని తెలిపారు. రానున్న 48 గంటల్లో ఈశాన్య రాష్ట్రాలకు కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందన్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను క్రమంగా ఉత్తర దిశగా కదులుతోందని తెలిపారు. ఇది మరికొంత కాలం ఉత్తర దిశగా కదులుతుందనీ, ఆ తర్వాత వాయువ్య దిశగా తన దిశను మార్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న 48 గంటల్లో తుఫాను మరింత బలపడి మరో 3 రోజుల్లో దాదాపు ఉత్తర వాయవ్య దిశగా కదులుతుందని ఐఎండీ తన బులెటిన్ లో పేర్కొంది. అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు మత్స్యకారులు వెళ్లవద్దనీ, సముద్రంలో ఉన్న వారు తీరానికి తిరిగి రావాలని ఐఎండీ సూచించింది.

click me!