అద్వానీ రథయాత్రను లాలు ప్రసాద్ ఆపినట్టే.. నితీశ్ కుమార్ కూడా...: తేజస్వీ యాదవ్

By Mahesh K  |  First Published Jun 9, 2023, 12:01 AM IST

లాలు ప్రసాద్ యాదవ్ గతంలో అద్వానీ రథయాత్రను అడ్డుకున్నాడని, ఇప్పుడు మోడీ రథాన్ని ప్రస్తుత మహా గట్ బంధన్ సారథి నితీశ్ కుమార్ అడ్డుకుంటాడని వివరించారు. 
 


పాట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ గతంలో అద్వానీ రథయాత్రను ఆపినట్టు ఇప్పటి మహా గట్ బంధన్ సారథి నితీశ్ కుమార్.. నరేంద్ర మోడీ రథాన్ని ఆపుతారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ యేతర పార్టీలు ఒక్కచోట చేరుతున్నాయని వివరించారు. బీజేపీ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ అభివృద్ధి పని చేసిందే లేదని, అది ఆపదలో పడ్డప్పుడు హిందూ లేదా ముస్లిం అనే బైనరీని ముందుకు తీసుకువస్తుందని తెలిపారు.

హిందువులైనా, ముస్లింలైనా, ఇతర ఏ మతస్తులైనా వారంతా.. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడారని తేజస్వీ అన్నారు. కొన్ని వర్గాల నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలు ఎక్కువగా వస్తుంటాయని, ముస్లిం ఓటు హక్కును తొలగించాలనీ డిమాండ్లు విన్నానని తెలిపారు. కానీ, లాలు ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ వంటి నేతలు మీ చుట్టు పక్కల ఉన్నప్పుడు ఇలాంటి పనులు జరగవని స్పష్టం చేశారు.

Latest Videos

ఒక వేళ కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే.. దేశాన్నంతా నాశనం చేస్తారని ఆరోపణలు గుప్పించారు. అధికార పీఠంపై మీద నియంత కూర్చున్నాడా? అనేట్టుగా ఇప్పుడు ఉన్నదని అన్నారు. ఆయన ఆజ్ఞలు ఇస్తుంటే మనమంతా వాటికి శిరసావహించాలి అనే ధోరణి ప్రబలుతున్నదని వివరించారు. 

Also Read: గుజరాత్ హైకోర్టులో మనుస్మృతి ప్రస్తావన.. ‘మైనర్‌లుగా ఉన్నప్పుడే గర్భం దాల్చేవారు’

రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి బ్యాంకు ఖాతా లో రూ. 15 లక్షల నగదు, 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని హామీలు ఇచ్చారని తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ హామీల గురించి నిలదీస్తే వారు వెంటనే హిందువులు, ముస్లింలకు మధ్య ఓ ఘర్షణ కలిగిస్తారని వివరంచారు.

బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రతిపక్షాలను ఏకతాటి మీదికి తీసుకు రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే తేజస్వీ యాదవ్ పై వ్యాఖ్యలు చేశారు.

click me!