రూ.3లక్షల క్యాష్ బ్యాగ్ కొట్టేసిన కోతి.. ఆ డబ్బుని ఏం చేసిందంటే..

Published : Aug 16, 2021, 09:14 AM IST
రూ.3లక్షల క్యాష్ బ్యాగ్ కొట్టేసిన కోతి.. ఆ డబ్బుని ఏం చేసిందంటే..

సారాంశం

బైక్ డిక్కీలోని రూ. 3 లక్షల రూపాయల నగదు బ్యాగును కోతి ఎత్తుకుపోయి, చెట్టుపైకి ఎక్కికూర్చుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పండ్లు, కూరగాయలు కనపడితే.. కోతులు ఎత్తుకెళ్లడం లాంటివి మీరు చాలా సార్లు చూసే ఉంటారు. కానీ..  డబ్బుల బ్యాగ్ కొట్టేయడం ఎప్పుడైనా చూశారా..? ఇలాంటి వింత సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఒక కోతి... రోడ్డు పక్కన నిలిపివుంచిన బైక్ డిక్కీలో నుంచి క్యాష్ బ్యాగును కొట్టేసి, వెంటనే చెట్టుపైకి ఎక్కికూర్చుంది. దీనిని గమనించిన ఆ బైక్ నడిపిన యువకుడు కంగారెత్తిపోయాడు. 

సాంఢీ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆశీష్ సింగ్ అనే యువకుడు తన బైక్ డిక్కీలోని రూ. 3 లక్షల రూపాయల నగదు బ్యాగును కోతి ఎత్తుకుపోయి, చెట్టుపైకి ఎక్కికూర్చుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇంతలో ఆ కోతి బ్యాగులోని డబ్బును తీసి కింద పడేసింది. దీనిని సమీపంలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు గమనించి, ఆ సొమ్మును తీసుకు వచ్చి పోలీసులకు అప్పగించారు. వారు ఆశీష్‌కు ఆ మొత్తాన్ని అందజేశారు. పోలీసులతో పాటు, ఆశీష్ ఆ హోమ్ గార్డు నిజాయితీని మెచ్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

బీహార్ రాజకీయాల్లో 30ఏళ్ల BJP కోట బద్దలు ప్రశాంత్ కిషోర్ చారిత్రక విజయం| Prashant Kishor victory
త్వరలో ప్లాస్టిక్ నోట్లు...ఇక పాత నోట్లు బ్యాన్ చేస్తారా? | Plastic Currency in India