తబ్లిగీ జమాత్ చీఫ్ పై మనీలాండరింగ్ కేసు

By telugu news teamFirst Published Apr 17, 2020, 8:10 AM IST
Highlights
మర్కజ్ కు భారత్ నుంచి, విదేశాల నుంచి నిధులు వచ్చే అన్ని మార్గాలను ఈడీ కూపీ లాగనుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే సాద్ ఖందాల్వీ, మరో ఐదుగురిపైనా '1897 అంటువ్యాధుల చట్టం' కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా మహ్మద్ సాద్ ఖందాల్వీపై  మనీలాండరింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రస్థాయిలో ప్రభలడానికి ప్రధాన కారణం మౌలానా మహ్మద్ సాద్ నేతృత్వంలో ఢిల్లీలో నిర్వహించిన సామూహిక ప్రార్థనలు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... కరోనాని పట్టించుకోకుండా మతపరమైన సమావేశం నిర్వహించారనే నెపంతో ఆయన పై ఇప్పటికే హత్యా నేరం కింద కేసు నమోదైంది.

కాగా.. తాజాగా..తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా మహ్మద్ సాద్ ఖందాల్వీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని మర్కజ్ కు అందే నిధులపై ఈడీ దర్యాప్తు చేయనుంది.

మర్కజ్ కు భారత్ నుంచి, విదేశాల నుంచి నిధులు వచ్చే అన్ని మార్గాలను ఈడీ కూపీ లాగనుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే సాద్ ఖందాల్వీ, మరో ఐదుగురిపైనా '1897 అంటువ్యాధుల చట్టం' కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

అటు ప్రత్యేకంగా సాద్ ఖందాల్వీపై ఢిల్లీ పోలీసులు శిక్షించదగిన హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఖందాల్వీ ఇప్పట్లో బయటపడడం అసాధ్యంగా కనిపిస్తోంది.

మర్కజ్ కు వచ్చిన నిధులు హవాలా మార్గాలు, నాన్ బ్యాంకింగ్ విధానాల ద్వారా వచ్చాయా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు సాగనుంది. ఈ కేసుకు సంబంధించి సాద్ కు, ఆయన అనుయాయులకు త్వరలోనే సమన్లు పంపుతామని ఈడీ వర్గాలు తెలిపాయి. అటు, ఢిల్లీకి చెందిన అధికార వర్గాలు త్వరలోనే సాద్ పై ఆదాయపన్ను విభాగం కూడా దృష్టి సారించే అవకాశాలున్నాయని తెలిపాయి.
click me!