ముగ్గురు పిల్లల గొంతు నులిమి చంపి.. తల్లి ఆత్మహత్య.. !

By AN TeluguFirst Published Sep 25, 2021, 10:24 AM IST
Highlights

కుటుంబ కలహాల కారణంగా ముగ్గురు పిల్లలను హత్య చేసిన తల్లి.. తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వేలూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వేలూరు తోటపాళ్యంకు చెందిన దినేష్ టైల్స్ అంటించే పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వేలూరు సలవన్ పేటకు చెందిన జీవిత (23)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.

వేలూర్ : కుటుంబ కలహాలు (Family Disputes) ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అభం, శుభం తెలియని చిన్నారులను పొట్టన పెట్టుకున్నాయి. కనిపెంచి బిడ్డల ఎదుగులను చూసి ఆనందించాల్సిన కన్నతల్లే అత్యంత కర్కశంగా గొంతునులిమి (Murder)చంపేలా చేశాయి. ఆ తరువాత ఉరి వేసుకుని ఆ తల్లి కూడా మరణించడం(Suicide) విషాదం. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

కుటుంబ కలహాల కారణంగా ముగ్గురు పిల్లలను హత్య చేసిన తల్లి.. తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వేలూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వేలూరు తోటపాళ్యంకు చెందిన దినేష్ టైల్స్ అంటించే పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వేలూరు సలవన్ పేటకు చెందిన జీవిత (23)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి అక్షయ (5),  నందకుమార్ (4), లతోపాటు ఆరు నెలల పసిపాప  ఉన్నారు.  కుటుంబం సలవన్ పేట కచ్చేరి వీధిలో నివాసం ఉంటుంది.  దినేష్ నిత్యం మద్యం మత్తులో గొడవ పడటమే కాకుండా, భార్యను చిత్రహింసలు పెట్టేవాడిని సమాచారం. ఈ క్రమంలో ఓ రోజు జీవిత తిరుపూర్ కుమరన్ రెండవ వీధిలో ఉన్న తన పుట్టింటికి పిల్లలతో సహా వెళ్ళింది. ఆ తరువాత ఈ  గురువారం ఉదయం తన ఇంటికి వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి బయలుదేరింది.

దినేష్ ఉదయం 7 గంటలకే పనికి వెళ్లి పోయాడు. జీవిత తల్లి  సాయంత్రం ఐదు గంటలకు ఆమెకు ఫోన్ చేసింది.  కానీ జీవిత పోన్ ఎత్తలేదు. ఎన్నిసార్లు చేసినా సమాధానం రాకపోవడంతో అనుమానంతో తన కుమారుడు జగదీశ్వరన్ కు  ఫోన్ చేసింది. ఏం జరిగిందో వెళ్లి చూసి రావాలని కోరింది. అతను జీవిత ఇంటికి వెళ్లి చూడగా,  తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నాయి.

దారుణం : ప్రతీకారం కోసం.. సొంత మనవరాలినే చంపిన 70యేళ్ల వృద్ధ జంట.. !
 
దీంతో ఏం చేయాలో తెలీక.. కాసేపటికి కిటికీలోనుంచి చేయిపెట్టి ఇంటి లోపలి  గడియ తీశాడు. లోనికి వెళ్లి చూడగా ముగ్గురు పిల్లలు, సోదరి విగతజీవులుగా కనిపించారు. వారిని గొంతు నులిమి చంపి.. ఆ తరువాత జీవిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు  గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

వేలూరు దక్షిణ పోలీస్ ఇన్స్పెక్టర్ నందకుమార్,   డి.ఎస్.పి ఆల్బర్ట్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన పోలీసులు అరెస్టు చేశారు దర్యాప్తు కొనసాగుతోంది. 

click me!