Tajinder Bagga : తజిందర్ పాల్ సింగ్ బగ్గాపై అరెస్టు వారెంట్ జారీ చేసిన మొహాలీ కోర్టు

Published : May 09, 2022, 12:29 PM IST
Tajinder Bagga : తజిందర్ పాల్ సింగ్ బగ్గాపై అరెస్టు వారెంట్ జారీ చేసిన మొహాలీ కోర్టు

సారాంశం

తజిందర్ సింగ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాలని మొహాలీ కోర్టు పోలీసులను అదేశించింది. ఈ మేరకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాపై మొహాలీ కోర్టు సోమవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయ‌న‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పంజాబ్ పోలీసులను కోర్టు ఆదేశించింది. బగ్గాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు ఆయనను ‘చట్టవిరుద్ధంగా’ విడుదల చేసినట్టు తెలిపింది.

‘‘హర్యానా పోలీసులు, ఢిల్లీ పోలీసుల చర్య చట్టవిరుద్ధం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. సైబర్ సెల్ లో నమోదైన కేసులో బగ్గాను పంజాబ్ పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. పగటిపూట జరిగిన నాటకీయ సంఘటనలలో ఢిల్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై అపహరణ కేసును నమోదు చేశారు. బగ్గాను తీసుకెళ్తున్న పంజాబ్ పోలీసుల బృందాన్ని హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రక్షించిన తరువాత అతను శుక్రవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తన అరెస్టుపై స్టే విధించినందుకు బగ్గా ట్విట్టర్ ద్వారా పంజాబ్, హర్యానా హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘ ఈ దేశంలో చట్టం ఇంకా పనిచేస్తోంది. మైనారిటీ కమిషన్ తో పాటు పంజాబ్, హర్యానా హైకోర్టుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తలపాగా ధరించడానికి నన్ను అనుమతించనందుకు మైనారిటీ కమిటీ పంజాబ్ ప్రభుత్వానికి నోటీసు పంపింది. సిక్కుల్లో తలపాగా లేకుండా బయటకు వెళ్లలేం’’ అని ఆయన ఓ వీడియోలో పేర్కొన్నారు.

మత విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గాపై నేరపూరిత బెదిరింపుల కింద కేసు పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 1న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తిలక్ నగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.బగ్గా అరెస్టుపై పంజాబ్ పోలీసులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసింది, 

ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తజీందర్ పాల్ సింగ్ బగ్గాను చూసి భయపడ్డారని, ఆయనకు పీడకలలు వస్తున్నాయని బగ్గా కుటుంబం ఆరోపించింది. ‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తజీందర్ ను చూసి భయపడుతున్నారు. ఇలాంటి సంఘటన ఇదే మొదటిసారి కాదు. ఇది గత ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. బగ్గా విషయంలో కేజ్రీవాల్ కు పీడకలలు వస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా అంటున్నారు ’’ అని బగ్గా తండ్రి ప్రీత్ పాల్ సింగ్ తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం