‘‘మోడీజీ.. హేట్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కలిసి ఉండలేవు’’ - రాహుల్ గాంధీ

Published : Apr 27, 2022, 12:37 PM ISTUpdated : Apr 27, 2022, 12:40 PM IST
‘‘మోడీజీ.. హేట్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కలిసి ఉండలేవు’’ - రాహుల్ గాంధీ

సారాంశం

ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేధికగా విమర్శలు గుప్పిస్తున్నారు. వారం రోజుల కిందట బొగ్గు, విద్యుత్ సంక్షోభంపై, మంగళవారం నిరుద్యోగంపై ట్విట్టర్ లో ప్రధానిపై మండిపడ్డ రాహుల్ గాంధీ.. తాజాగా దేశం విడిచిపెళ్లిపోయిన గ్లోబల్ కంపెనీల విషయంలో మోడీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.   

ఇండియా నుంచి నుండి కొన్ని గ్లోబల్ బ్రాండ్లు వెన‌క్కివెళ్లిపోవ‌డంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకుప‌డ్డారు. ఈ మేర‌కు బుధ‌వారం ట్విట్ట‌ర్ లో ప్ర‌ధానిపై విమ‌ర్శ‌లు చేశారు. హేట్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కలిసి ఉండలేవని అన్నారు. 

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై కూడా రాహుల్ గాంధీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది వినాశకరమైన నిరుద్యోగ సంక్షోభంపై దృష్టి పెట్టాల్సిన స‌మ‌యం అని ప్ర‌ధానికి సూచించారు. ‘‘ భారత్‌లో పని చేస్తున్న 7 గ్లోబల్ బ్రాండ్లు, 9 ఫ్యాక్టరీలు, 649 డీలర్‌షిప్‌లు, 84,000 ఉద్యోగాలు వెళ్లిపోయాయి’’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.  మోడీ జీ, హేట్-ఇన్-ఇండియా, మేక్-ఇన్-ఇండియా కలిసి ఉండలేవని ఆ ట్వీట్ లో ఆయ‌న పేర్కొన్నారు. 

ఈ ట్వీట్ లో రాహుల్ గాంధీ ఓ ఫొటో షేర్ చేశారు. అందులో ఆయ‌న ఏడు గ్లోబల్ బ్రాండ్‌లను ప్రెజెంట్ చేశారు. ఇందులో 2017లో చేవ్రొలెట్, 2018లో MAN ట్రక్స్, 2019లో ఫియట్,  యునైటెడ్ మోటార్స్, 2020లో హార్లే డేవిడ్‌సన్, 2021లో ఫోర్డ్, 2022లో డాట్సన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇవ‌న్నీ మ‌న దేశం నుంచి వెళ్లిపోయాయి, 

రాహుల్ గాంధీ మంగళవారం కూడా నిరుద్యోగ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. మాస్టర్ స్ట్రోక్ కారణంగా 45 కోట్ల మందికి పైగా ప్రజలు ఉద్యోగాలు పొందాలనే ఆశ కోల్పోయారని ఆరోపించారు. 75 ఏళ్లలో అలా చేసిన మొదటి ప్రధాని మోదీ అని ఆయన పేర్కొన్నారు. న్యూ ఇండియా కొత్త నినాదం హర్-ఘర్ బేరోజ్‌గారీ, ఘర్-ఘర్ బేరోజ్‌గారీ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

దేశంలో బొగ్గు, విద్యుత్ సంక్షోభంపై కూడా ప్రధాని మంత్రిని టార్గెట్ గా చేసుకొని ఈ నెల 20వ తేదీన రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశంలో కేవలం ఎనిమిది రోజులకు స‌రిప‌డా బొగ్గు నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయని ప్ర‌ధాని పై మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాటు జరిగిన పెద్ద చర్చ ఫలితంగా భారత్‌లో కేవలం ఎనిమిది రోజుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని ఆరోపించారు. మరిన్ని ఉద్యోగ నష్టాలకు దారితీసే చిన్న తరహా పరిశ్రమల నష్టాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరిత బుల్డోజర్లను బంద్ చేసి పవర్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని ఆయ‌న సూచించారు. 

‘‘ మోదీ జీ, స్తబ్దత పొంచి ఉంది. విద్యుత్ కోతలు చిన్న పరిశ్రమలను అణిచివేస్తాయి. ఇది మరిన్ని ఉద్యోగ నష్టాలకు దారి తీస్తుంది. ద్వేషపూరిత బుల్డోజర్లను స్విచ్ ఆఫ్ చేసి పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి!’’ అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.  దిగుమతులను తగ్గించడం ద్వారా ఇంధనంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడానికి వాణిజ్య మైనింగ్ కోసం 41 బొగ్గు గనులను వేలం వేయడానికి 2020 జూన్ 18వ తేదీన ప్రధాని మోడీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను కూడా ఆయ‌న షేర్ చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న బొగ్గు సంక్షోభ పరిస్థితులతో దానిని పోల్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్