తమిళనాడు ఆలయ వేడుకల్లో ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం..

Published : Apr 27, 2022, 07:28 AM ISTUpdated : Apr 27, 2022, 08:12 AM IST
తమిళనాడు ఆలయ వేడుకల్లో ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం..

సారాంశం

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆలయంలో జరుగుతున్న వేడుకల్లో ప్రమాదం జరిగింది. దీంతో 11మంది సజీవదహనం అయ్యారు. మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. 

చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.  తంజావూరు కలియమేడులోని ఆలయ వేడుకల్లో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లైవ్ వైర్ కారుకు తగలడంతో మంటలు చెలరేగాయి. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కార్ల వేడుకల్లో ఈ ప్రమాదం సంభవించింది. 

కలిమేడు ఎగువ ఆలయంలో తిరునారు కరసు స్వామి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. రథాన్ని బంకమట్టిలోని పలు వీధుల గుండా ఊరేగించారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో కలిమేడు ప్రాంతంలోని పూతలూరు రోడ్డులో రథం నిలిచిపోయింది. హైవోల్టేజీ వైరు తగిలి కరెంట్ షాక్ ఏర్పడింది. దాంతో మంటలు చెలరేగాయి. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

గాయపడినవారిని తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు గాయపడినవారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో పది మంది మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృత్యువాత పడ్డారు.

కాగా, ఏప్పిల్ 13న గురుగ్రామ్ లోని ఓ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌సాదం పేరిటి ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆల‌యం దగ్గర పండ్ల ర‌సం పంపిణీ చేశాడు. అది తాగిన 25 మంది స్పృహతప్పి ప‌డిపోయారు. ఇది గమనించిన స్థానికులు వేంట‌నే వీరిని ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌నీ, ఎలాంటి అనుకోని ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేద‌ని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న గురుగ్రామ్ లోని ఓ ఆల‌యం చోటుచేసుకుంది. దీంతో ప్రసాదం పేరుతో పండ్ల ర‌సం అందించిన వ్య‌క్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. గురుగ్రామ్‌లోని  ఫరూఖ్ నగర్ ప్రాంతంలోని బుధో మాత ఆలయంలో ఆ రోజు జాతర జరిగింది. ఈ జాతరకు చాలామంది భక్తులు వచ్చారు.ఈ క్ర‌మంలోనే ఓ వ్య‌క్తి జాత‌ర‌లో తిరుగుతూ ప్ర‌సాదం పేరుతో వ‌చ్చిన భ‌క్తులు పండ్ల ర‌సం అందించాడు. అయితే, ఈ పండ్ల ర‌సం తాగిన 25 మంది స్పృహతప్పి ప‌డిపోయారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీని గురించి స్థానిక అధికారులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు, స్థానికులు వెంట‌నే వారిని ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారు బాగానే ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. గుర్తుతెలియ‌ని వ్య‌క్తి భ‌క్తుల‌కు ప్ర‌సాదం పేరుతో అందించిన ఈ పానీయంలో మ‌త్తు మందు క‌లిపి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 

"బాధితులను బుధవారం ఉదయం ఆస్పత్రిలో చేర్చారు. కోలుకున్న తరువాత వారిని డిశ్చార్జ్  చేశారు. అయితే, ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఎలాంటి దోపిడీ కానీ, దొంగతనం కానీ జరిగినట్టు తెలియలేదని పోలీసులు తెలిపారు. పండ్ల ర‌సం అందించిన వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని వెల్ల‌డించారు. ఫరూఖ్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సునీల్ బెనివాల్ మాట్లాడుతూ.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 328,  336, 120-బి కింద నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామ‌ని తెలిపారు. గుడి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి పండ్ల రసాన్ని ప్రసాదంగా పేర్కొంటూ ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌వారికి అందించాడ‌ని చెప్పారు. 

ఈ కేసు ఫిర్యాదుదారుల్లో ఒకరైన ఢిల్లీ నివాసి సుశీల్ కుమార్ తన కుటుంబంతో సహా ఆలయానికి వ‌చ్చారు. జ‌రిగిన ఘ‌ట‌న గురంచి ఆయ‌న మాట్లాడుతూ.. “ఒక వ్యక్తి వచ్చి గ్లాసుల్లో పండ్ల రసాన్ని అందించినప్పుడు మేము మా కారు నుండి దిగాము. ఇది తాను అందించిన 'ప్రసాదం' అని మరియు అందరికీ అందిస్తున్నానని చెప్పాడు. "నా భార్య మరియు నా మేనకోడలు జ్యూస్ తాగిన తర్వాత స్పృహ తప్పి పడిపోయారు. ఇతర వ్యక్తులు కూడా స్థానికంగా ఏడుపు విన్నాము, వారు కూడా  ఆ వ్య‌క్తి అందించిన పండ్ల ర‌సం తాగి ఉండవచ్చు" అని పేర్కొన్నాడు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్