ప్రధాని మోడీ మంత్రివర్గంపై వీగిన అవిశ్వాసం

First Published Jul 20, 2018, 11:13 PM IST
Highlights

 కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాసానికి అనుకూలంగా కేవలం 126 ఓట్లు మాత్రమే వచ్చాయి..

న్యూఢిల్లీ: కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాసానికి అనుకూలంగా కేవలం 125 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఓటింగ్ సమయంలో లోక్‌సభలో 451 మంది సభ్యులున్నారు.అయితే అవిశ్వాసానికి అనుకూలంగా 126  ఓట్లు మాత్రమే వచ్చాయి. వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి.

కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంలో శివసేన, బీజేడీలు దూరంగా ఉన్నాయి.ఈ రెండు పార్టీలు అవిశ్వాసంపై చర్చలో కూడ పాల్గొనలేదు. అవిశ్వాసంలో ఏ పార్టీ కూడ తటస్థంగా లేదు. అవిశ్వాసంపై ఓటింగ్ లో 451మంది సభ్యులు పాల్గొన్నారు.

బీజేపీయేతర పార్టీలన్నీ అవిశ్వాసం విషయంలో కలిసి రాలేదు. దీంతో అవిశ్వాసానికి రావాల్సిన ఓట్లు కూడ రాలేదు. మిగిలిన పార్టీలు కలిసి వస్తే ఇంకా కొన్నిఎక్కువ ఓట్లు వచ్చేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్నాడీఎంకె  కావేరీ సమస్యను చూపి అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉంటానని ప్రకటించింది.  బీజేడీ , శివసేనలు అవిశ్వాసానికి దూరంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడ అవిశ్వాసం విషయంలో మద్దతిస్తాయని విపక్షాలు భావించాయి . కానీ విపక్షాల ఆశలు మాత్రం నెరవేరలేదు. తొలుత మూజువాణి ఓటులో అవిశ్వాసం వీగిపోయిందని స్పీకర్ ప్రకటించారు.అయితే విపక్షాలు డివిజన్ ను కోరాయి. అయితే దీంతో ఓటింగ్ నిర్వహించారు.

ఇదిలా ఉంటే సుదీర్ఘంగా సాగిన సభలో విపక్షాలు చేసిన విమర్శలకు మోడీ ఘాటైన పదజాలంతో సమాధానమిచ్చారు.రాత్రి 11 గంటల తర్వాత అవిశ్వాసంపై ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లో అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాసానికి అనుకూలంగా కేవలం 126 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఓటింగ్ ముగిసిన తర్వాత లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్ 

 

click me!