లాల్ ఖిల్లాపై జెండా ఎగరేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

By telugu teamFirst Published Aug 15, 2021, 7:50 AM IST
Highlights

75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతినుద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు తెల్లవారుజామునే మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని లాల్ ఖిల్లాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌ను లీడ్ చేయనున్నారు. ఉదయమే ఎర్రకోట చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. లాల్‌ఖిల్లాపై ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేసి జాతినుద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తున్నది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలోనే దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఈ ఏడాదిలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం వేడుకల్లో సరికొత్త ఉత్తేజం వెల్లివిరుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

సుమారు ఏడు గంటల ప్రాంతంలో దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండాను ఎగరేశారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 7.15 గంటలకు రాజ్‌ఘాట్‌లోని సమాధి దగ్గర మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడే జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు.

click me!