Modernise Police Forces: పోలీసు బలగాలను ఆధునీకరణ‌.. రూ. 26,275 కోట్ల కేటాయింపులు

Published : Feb 13, 2022, 04:46 PM IST
Modernise Police Forces: పోలీసు బలగాలను ఆధునీకరణ‌.. రూ. 26,275 కోట్ల కేటాయింపులు

సారాంశం

Modernise Police Forces: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పోలీసు బలగాల అభివృద్ధి, ఆధునికీకరణ మెరుగైన సాంకేతికత, ఆయుధాలు, ఫోరెన్సిక్ సౌకర్యాల కోసం ప్రత్యేక పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. 2021-22 నుండి 2025-26 మధ్య కాలంలో పోలీసు బలగాల ఆధునీకరణ (MPF) పథకం ఆమోదించబడిందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  తెలిపింది.  

Modernise Police Forces: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పోలీసు బలగాల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రత్యేక పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. . 2021-22 నుండి 2025-26 మధ్య కాలంలో పోలీసు బలగాల ఆధునీకరణ (MPF) పథకం ఆమోదించబడిందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  తెలిపింది. ఈ పథకంలో వివిధ ఉప పథకాలు దీనిలో ఉంటాయని, మొత్తం మీద రూ.26,275 కోట్లు కేటాయించిన‌ట్టు కేంద్రం తెలిపింది. 

ఈ పథకం కింద అంతర్గత భద్రత, శాంతిభద్రతల‌ను మెరుగుప‌ర‌డం కోసం పోలీసు వ్యవస్థ ఆధునీక‌ర‌ణ‌, త‌ద్వారా శాస్త్రీయంగా, సకాలంలో దర్యాప్తు జరగడానికి  ఉప‌యోగప‌డుతోంద‌ని తెలిపింది. అలాగే,ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు, ఇన్‌స్టిట్యూషన్లు, పరికరాలను నవీకరించేందుకు రాష్ట్రాలకు సాయం అందుతుందని, సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద గ్రాంటుల రూపంలో ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపింది. రాష్ట్ర పోలీసు బలగాల ఆధునీకరణ కోసం కేంద్రం ₹ 4,846 కోట్లు మంజూరు చేస్తుందని తెలిపింది. 

స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహించే విధంగా వీటిని తీర్చిదిద్దుతామని తెలిపింది. ఫోరెన్సిక్ ఫెసిలిటీస్ ఆధునికీకరణ కోసం  ఈ పథకం కింద రూ.2,080.50 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. 

జమ్మూ & కాశ్మీర్,  కేంద్రపాలిత ప్రాంతాలు, తిరుగుబాటు ప్రభావిత ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష తీవ్రవాదం (LWE) ప్రభావిత ప్రాంతాలకు భద్రత సంబంధిత వ్యయం కోసం ₹18,839 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. LWEని ఎదుర్కోవడానికి ‘నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్’ అమలులోకి తీసుకోవ‌చ్చిన‌ట్టు కేంద్రం తెలిపింది. ఈ యాక్ష‌న్ ప్లాన్ అమ‌లు చేయ‌డం వ‌ల్ల LWE ప్రభావిత ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు బాగా తగ్గాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. మ‌రో ఆరు LWE ప్రభావిత ప్రాంతాల్లో నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్’ అమలు చేయ‌డానికి రూ.8,689 కోట్లను ఆమోదించిన‌ట్టు తెలిపింది.  LWE ప్రభావిత జిల్లాలు & సంబంధిత జిల్లాలకు ప్రత్యేక కేంద్ర సహాయాన్ని (SCA) అందిస్తున్న‌ట్టు కేంద్రం తెలిపింది.

ఇండియా రిజర్వ్ బెటాలియన్లు/స్పెషలైజ్డ్ ఇండియా రిజర్వ్ బెటాలియన్ల ఆదునీక‌ర‌ణ  కోసం కేంద్రం ₹350 కోట్లను అందించిన‌ట్టు తెలిపింది. అలాగే..మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహాయ పథకం క్రింద రూ.50 కోట్లు కేటాయించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !