మోడీ ప్ర‌భుత్వం భారత్‌లో దర్యాప్తు సంస్థలను బలోపేతం చేసింది - అమిత్ షా

By team teluguFirst Published Aug 28, 2022, 9:36 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను బలోపేతం చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాద చర్యలను అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న ఎన్ఐఏను ప్రశంసించారు. 

ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ పాలసీకి అనుగుణంగా ఎన్ఐఏతో పాటు భారత్ లో దర్యాప్తు సంస్థలను బలోపేతం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం కృషి చేసింద‌ని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విష‌యంలో కేంద్రం ‘‘ఏ రాయిని వ‌దిలిపెట్టలేదు’’ అని చెప్పారు. శనివారం రాయ్‌పూర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయ‌న పాల్గొన్నారు. 

నిర్మాణ శైలి ఓ అద్భుతం.. అట‌ల్ బ్రిడ్జిను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడారు. ప్రపంచంలోనే ఉగ్రవాద వ్యతిరేక సంస్థగా తనను తాను స్థాపించుకున్నందుకు ఎన్ఐఏను ప్రశంసించారు. ఎన్ఐఏను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రస్తావిస్తూ.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజ‌కీయ పార్టీతో సంబంధం లేకుండా ‘‘ఉగ్రవాద సంబంధిత సమాచారాన్ని’’ వాటితో పంచుకుంటోందని అమిత్ షా అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రస్తుతం 94.23 శాతంగా ఉన్న శిక్షా రేటును 100 శాతానికి పెంచాలని అమిత్ షా ఎన్ఐఏకు సూచించారు.

देश के हर राज्य में NIA की मौजूदगी सुनिश्चित कर मोदी सरकार NIA को एक फेडरल क्राइम इन्वेस्टिगेशन एजेंसी के रूप में और सशक्त बना रही है।

आज नवा रायपुर में के कार्यालय का उद्घाटन किया, इससे छत्तीसगढ़ की भूमि से नक्सलवाद को जड़ से समाप्त करने में और मदद मिलेगी। pic.twitter.com/zoomJOmxOU

— Amit Shah (@AmitShah)

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో శాంతిని ప్రస్తావిస్తూ లోయలో ఉగ్రవాద నిధులపై అణచివేతను అమిత్ షా ఎత్తి చూపారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కశ్మీర్ ను ఉగ్రవాదం నుంచి పూర్తిగా విముక్తం చేసేందుకు ప్రయత్నించామ‌ని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ ప్రాంతంలో శాంతి కనిపిస్తుంద‌ని తెలిపారు. 

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనేవారికి పంజాబ్‌ ప్రభుత్వం బంపర్ ఆఫర్‌!

‘‘ ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలో మన ఏజెన్సీల సంపూర్ణ శక్తిని మనం నేడు చూస్తున్నాం.  2018, 2019, 2020 సంవత్సరాల్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన వారిపై ఎన్ఐఏ కఠినంగా వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం. 105 కేసులు నమోదు అయ్యాయి. 876 మంది నిందితులను అరెస్టు అయ్యారు. 105 కేసుల్లో 94 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు ’’ అని అమిత్ షా చెప్పారు.

డ్రాగ‌న్ కుటిల బుద్ధి.... అరుణాచల్‌లో చైనా భారీ నిర్మాణాలు

ఈ సమావేశంలో సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తెరిచిన ఎన్ఐఏ శాఖల వివరాలను అమిత్ షా వెల్లడించారు. 2024లో వచ్చే లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు ప్రతి రాష్ట్రంలో తన శాఖను తెరవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
 

click me!