పార్లమెంట్ సమావేశాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వర్చువల సెషన్స్ నిర్వహించే అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు చర్చలు జరిపారు
పార్లమెంట్ సమావేశాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వర్చువల సెషన్స్ నిర్వహించే అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు చర్చలు జరిపారు.
ఈ- సెషన్స్‌కు సంబంధించి త్వరలోనే తేదీలను ప్రకటించనున్నారు. కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్లమెంట్ సమావేశాలు జరపడం సాధ్యం కాదని గతంలో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
undefined
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తే సైట్‌లో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. సోషల్ మీడియా ద్వారా ముఖ్యమైన సమాచారం లీకయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
దశల వారీగా రైలు, విమాన ప్రయాణాలు తిరిగి ప్రారంభ కావడం.. అంతర్రాష్ట్ర ప్రయాణాలను కూడా కేంద్రం అనుమతించడంతో సభ్యుల ప్రయాణాలకు ఎటువంటి ఆటంకం ఉండదని భావిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో వర్చువల్ సమావేశాల వైపు ఉభయ సభలు దృష్టి సారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.