ఎంఎస్ఎంఈలకు ఊతం.. రూ.50 వేల కోట్లు ఈక్విటీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Siva Kodati |  
Published : Jun 01, 2020, 04:38 PM ISTUpdated : Jun 01, 2020, 04:41 PM IST
ఎంఎస్ఎంఈలకు ఊతం.. రూ.50 వేల కోట్లు ఈక్విటీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సారాంశం

కరోనాతో కారణంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు

కరోనాతో కారణంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దీనిలో భాగంగా ఎంఎస్ఎంఈలకు రూ.20 వేల కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు.

ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి ఎంఎస్ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. ప్యాకేజీ ద్వారా ఎంఎస్ఎంఈలకు సరికొత్త నిర్వచనమని ప్రకాశ్ అభివర్ణించారు. ఎంఎస్ఎంఈల కోసం రూ.50 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు సేకరిస్తున్నట్లు తెలిపారు.

రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్న ఆయన.. అన్నదాతల కోసం కిసాన్ క్రెడిట్ కార్డుల పథకాన్ని తీసుకొస్తామన్నారు. రోడ్ సైడ్ వ్యాపారుల కోసం రూ.10 వేల రుణం ఇస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధర ఇస్తున్నామన్నారు.     

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu