సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు: మోడీ అత్యవసర సమావేశం

By narsimha lodeFirst Published Feb 27, 2019, 5:09 PM IST
Highlights

భారత భూభాగంలోకి పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాలు చొచ్చుకు వచ్చినట్టుగా సమాచారం రావడంతో ప్రధానమంత్రి మోడీ అత్యవసరంగా ఉన్నతాధికారులతో బుధవారం నాడు సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాలు చొచ్చుకు వచ్చినట్టుగా సమాచారం రావడంతో ప్రధానమంత్రి మోడీ అత్యవసరంగా ఉన్నతాధికారులతో బుధవారం నాడు సమావేశమయ్యారు.

ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో మోడీ ప్రసంగిస్తుండగా భారత్ భూభాగంలోకి పాక్ విమానాలు చొరబడినట్టుగా సమాచారం అందింది. దీంతో మోడీ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. భద్రతా పరమైన అంశాలపై మోడీ అధికారులతో చర్చించారు.

నార్త్ బ్లాక్‌లో రాజ్‌నాథ్ సింగ్  ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జాతీయ భద్రతా  సలహాదారు అజిత్ ధోవల్‌ పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పాక్ సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

click me!