కేంద్ర మంత్రి వర్గ విస్తరణ: పూర్తయిన మంత్రుల ప్రమాణ స్వీకారం

Siva Kodati |  
Published : Jul 07, 2021, 06:14 PM ISTUpdated : Jul 07, 2021, 08:26 PM IST
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ: పూర్తయిన మంత్రుల ప్రమాణ స్వీకారం

సారాంశం

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. కొత్త, పాత కలయికతో పాటు సీనియర్లు, జూనియర్లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రధాని నరేంద్రమోడీ తన కేబినెట్‌ను పునర్ వ్యవస్ధీకరించనున్నారు. మొత్తం 43 మందితో కూడిన మంత్రుల జాబితాను మీడియాకు విడుదల చేశాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.   

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. కొత్త, పాత కలయికతో పాటు సీనియర్లు, జూనియర్లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రధాని నరేంద్రమోడీ తన కేబినెట్‌ను పునర్ వ్యవస్ధీకరించనున్నారు. మొత్తం 43 మందితో కూడిన మంత్రుల జాబితాను మీడియాకు విడుదల చేశాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. 

కేబినెట్ మంత్రులు: 

నారాయణ్ రాణే: (బీజేపీ) - మహారాష్ట్ర
శర్వానంద సోనోవాట్ : (బీజేపీ) - అసోం
డా.వీరేంద్రకుమార్ : (బీజేపీ) - మధ్యప్రదేశ్
జ్యోతిరాదిత్య సింధియా : (బీజేపీ) - మధ్యప్రదేశ్
రాంచంద్ర ప్రసాద్ సింగ్: (జేడీయూ) -  బీహార్
అశ్వినీ వైష్ణవ్: (బీజేపీ) - ఒడిశా
పశుపతి కుమార్ పరాస్ : లోక్‌జన శక్తి (బీహార్)
కిరణ్ రిజిజు: (బీజేపీ) - అరుణాచల్ ప్రదేశ్
రాజ్‌కుమార్ సింగ్ : బీజేపీ (బీహార్)
హర్దీప్ సింగ్ పూరి : బీజేపీ (ఢిల్లీ)
మన్‌సుఖ్ మాండవీయ: బీజేపీ (గుజరాత్)
భూపేంద్ర యాదవ్ : బీజేపీ (రాజస్థాన్)
పురుషోత్తం రూపాలా: బీజేపీ (గుజరాత్)
కిషన్ రెడ్డి : బీజేపీ (తెలంగాణ)
అనురాగ్ సింగ్ ఠాకూర్ : బీజేపీ (హిమాచల్ ప్రదేశ్)
పంకజ్ చౌధరీ : బీజేపీ (ఉత్తరప్రదేశ్)
అనుప్రియా సింగ్ పటేల్ : అప్నాదళ్ (ఉత్తరప్రదేశ్)
డా.సత్యపాల్ సింగ్ భగేల్: బీజేపీ (ఉత్తరప్రదేశ్)
రాజీవ్ చంద్రశేఖర్: బీజేపీ (కర్ణాటక)
శోభా కరంద్లాజే: బీజేపీ (కర్ణాటక)

కేంద్ర మంత్రిగా తెలుగు ఎంపీ కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన ఆయన.. మోడీ కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల కాలంలో తన పనితీరు, ప్రతిభతో మోడీని ఆకట్టుకున్నారు. తాజాగా మంత్రి వర్గం విస్తరణలో ఆయన కేబినెట్ ర్యాంక్‌ను పొందారు. 

43 మందితో జరిపిన కేబినెట్ విస్తరణలో రాజీవ్ చంద్రశేఖర్  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. రాజ్య సభ ఎంపీగా కొనసాగుతున్న రాజీవ్ చంద్రశేఖర్ రాజకీయాల్లోకి వచ్చేముందు భారతదేశంలో మొబైల్ విప్లవానికి తొలి అడుగులు వేసిన అతి కొద్ది మందిలో ఒకరు.

 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu