కరోనా కలవరం.. ఖుష్బూ ఇంట విషాదం

By telugu news teamFirst Published Jun 1, 2020, 2:03 PM IST
Highlights

ఖుష్బూ సమీప బంధువు కరోనా వైరస్‌ సోకి మృతి చెందటంతో ఆమె శోకంలో మునిగిపోయారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ 8వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువౌతోంది. ఇక మరణాల సంఖ్య 5వేలు దాటేసింది. అయితే... ఈ వైరస్ కారణంగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ ఇంట విషాదం చోటుచేసుకుంది.

ఖుష్బూ సమీప బంధువు కరోనా వైరస్‌ సోకి మృతి చెందటంతో ఆమె శోకంలో మునిగిపోయారు. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందిన రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 62 వేల మందికిపైగా కరోనా బాధితులుండగా వారిలో రెండువేలమందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ముంబయిలో ఉన్న ఖుష్బూ బంధువు కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. దీంతో సినీరంగ ప్రముఖులు, అభిమానులు ఆమెను ఓదార్చుతూ సందేశాలు పంపుతున్నారు.

Very unfortunately my eldest sis-in-law lost her cousin to -19 in Mumbai.. it’s painful.

— KhushbuSundar ❤️ (@khushsundar)

 

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న 8వేల పై చిలుకు కేసులు నమోదయి భయపెడితే, నేడు సైతం(ఉదయం 8 గంటల వరకు ఉన్న డేటా ఆధారంగా) 8వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. 

నిన్న 8,380 కరోనా కేసులు నమోదయితే, నేడు ఎక్కువగా 8,392 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకరోజులో నమోదయిన అత్యధిక కేసుల నిన్నటి రికార్డును ఇవి బద్దలు కొట్టాయి. మొత్తం కేసుల సంఖ్యా లక్షా తొంభై వెలను దాటాయి. 
ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి 5,394 మంది మరణించారు. 

ఇకపోతే.... భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్ డౌన్ ను కూడా సడలించడంతో కేసుల సంఖ్యా అంతకంతకు పెరుగుతూ ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 

ఇప్పటికే అత్యధిక కేసులు నమోదవుతుండడంతో ప్రపంచంలో కరోనా వైరస్ బారినపడ్డ టాప్ 10 దేశాల్లో భారత్ కూడా చేరిపోయింది. తాజాగా 1,88,000 పైచిలుకు కేసులతో టాప్ 10 లో 9వ స్థానంలో ఉన్న భారత్ ఫ్రెండు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. 

18 లక్షల పైచిలుకు కేసులతో అమెరికా అగ్ర స్థానములో ఉండగా, ఆతరువాత 5 లక్షల పైచిలుకు కేసులతో బ్రెజిల్, నాలుగు లక్షల కేసులతో రష్యా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఇకపోతే... కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసింది  కేంద్ర ప్రభుత్వం. 

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరిన్ని సడలింపులతో జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుండి దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, హోటల్లు, రెస్టారెంట్, మాల్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతించారు.  అలాగే రాష్ట్రాల అనుమతితో అంతర్రాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణా చేసుకోవచ్చని  తెలిపింది. 

ఇక విద్యాసంస్థలపై నిర్ణయాన్ని కూడా కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. 

click me!