ఎమ్మెల్యే భార్యకు కరోనా, ఎమ్మెల్యేతోపాటు సిబ్బంది కూడా క్వారంటైన్

By Sreeharsha GopaganiFirst Published Jul 15, 2020, 8:17 AM IST
Highlights

కర్ణాటక రాష్ట్ర అర్సి కేరే ఎమ్మెల్యే శివ లింగ గౌడ్ భార్యకు కరోనా సోకింది. ఆమెకు కరోనా సోకడంతో ఎమ్మెల్యే, అతని సిబ్బంది అందరూ కూడా క్వారంటైన్ లోకి వెళ్లారు. 

కరోనా వైరస్ వ్యాప్తి నానాటికి ఎక్కువవుతోంది. ప్రజలందరూ తన ముందు ఒక్కటే అన్నట్టుగా అందరికి సోకుతుంది ఈ వైరస్. తాజాగా కర్ణాటక రాష్ట్ర అర్సి కేరే ఎమ్మెల్యే శివ లింగ గౌడ్ భార్యకు కరోనా సోకింది. ఆమెకు కరోనా సోకడంతో ఎమ్మెల్యే, అతని సిబ్బంది అందరూ కూడా క్వారంటైన్ లోకి వెళ్లారు.  

భార్యకు కరోనా సోకడంతో ఆమెను హాసన్ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో చేర్పించినట్టుగా  సదరు ఎమ్మెల్యే తెలిపారు. తన కుటుంబసభ్యులతోపాటు సిబ్బందికి  కరోనా నెగిటివ్ అని వచ్చిందని ఎమ్మెల్యే చెప్పారు. 

తన భార్యకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, అందువల్ల త్వరగా ఆమె కోలుకుంటుందని చెప్పారు. తాను హోంక్వారంటైన్ లో ఉన్నందున వారం రోజుల పాటు తనను కలిసేందుకు ఇంటికి రావద్దని, ఏవైనా సమస్యలుంటే తనకు ఫోన్ లో చెప్పాలని ఎమ్మెల్యే శివలింగ కోరారు.

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మంగళవారం 1,524 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 37,745కి చేరింది.

నిన్నొక్కరోజే వైరస్‌తో పది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 375కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 12,531 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇవాళ ఒక్కరోజే 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 24,840కి చేరింది.

మంగళవారం ఒక్క హైదరాబాద్‌లోనే 815 మందికి పాజిటివ్‌గా తేలగా.. ఆ తర్వాత రంగారెడ్డి 240, మేడ్చల్ 97, సంగారెడ్డి 61, నల్గొండ 38గా ఉన్నాయి. 

కాగా, తెలంగాణలో కోవిడ్ 19 నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణా పరీక్షలు చేయకపోవడంపై రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోనూ కోవిడ్ పరీక్షలు జరపాలని ఆదేశించింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని సూచించింది.

కరోనా బాధితులకు 4 లక్షల రూపాయలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ప్రైవేట్ కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీలు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

click me!