మిజోరాం ఎన్నికల ఫలితాలు 2023 : 40 స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం...

By SumaBala Bukka  |  First Published Dec 4, 2023, 8:25 AM IST

మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది.


మిజోరాం : మిజోరాం ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. బరిలో ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్ లు ఉన్నాయి. మొత్తం 40 స్థానాల్లో ఈ పార్టీల నుంచి అభ్యర్థులను నిలబెట్టారు. బీజేపీ మాత్రం 23 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. నవంబర్ 7 వతేదీన ఎన్నికలు జరగగా.. మిగతా నాలుగు రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3నకౌంటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు మిజోరాంలో ప్రత్యేకమైన రోజు కావడంతో ఒక రోజు ఆలస్యంగా సోమవారం కౌంటింగ్ ప్రారంభమయ్యింది. 

కౌంటింగ్ కోసం 13 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. 40 స్థానాల్లో  బరిలో మొత్తం 174 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, ప్రధానంగా ప్రాంతీయ పార్టీలైన ఎంఎన్ఎఫ్, జెడ్పీఎంల మధ్య తీవ్రపోటీ కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార ఎంఎన్ఎఫ్, మాజీ IPS అధికారి లాల్దుహోమా జెడ్ పీఎం మధ్య తీవ్ర పోరును సూచించాయి.

Latest Videos

click me!