కాంగ్రెస్‌ను తిప్పికొట్టిన హిందీ బెల్ట్ .. ఉత్తరాదిలో పట్టు సడలనివ్వని బీజేపీ, ‘‘ హస్తం ’’ తప్పెక్కడ చేస్తోంది

By Siva Kodati  |  First Published Dec 3, 2023, 8:51 PM IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఫలితాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ సొంతం చేసుకోగా.. వీటిలో రెండు కాంగ్రెస్ అధికారంలో వున్నవి కావడం గమనార్హం. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, దక్షిణాదిలో తన బలాన్ని పెంచుకుంది.


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఫలితాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ సొంతం చేసుకోగా.. వీటిలో రెండు కాంగ్రెస్ అధికారంలో వున్నవి కావడం గమనార్హం. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, దక్షిణాదిలో తన బలాన్ని పెంచుకుంది. వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై ఈ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఈ ఎన్నికలు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. 

తెలంగాణలో విజయంతో కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతదేశంలో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకోగా.. హిందీ బెల్ట్‌లో మాత్రం బీజేపీ తన పట్టు నిలుపుకుంది. హిందీ భాషా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రజల తీర్పు.. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ప్రశ్నలకు లేవనెత్తింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే..  దాని హామీలు హిందీ బెల్ట్‌లో కనిపించకపోవడం. ప్రాంతీయ నాయకత్వంపైనే ఆ పార్టీ ఎక్కువగా ఆధారపడుతున్న వ్యూహం బెడిసి కొడుతున్నట్లుగా కనిపిస్తోంది.

Latest Videos

కమల్‌నాథ్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ తమ తమ రాష్ట్రాల్లో స్వేచ్ఛగా పనిచేసేలా కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్.. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడానికి స్థానిక నాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని ఆదేశించింది. కానీ ఫలితాలను చూసినట్లయితే ఈ రాష్ట్రాల ప్రజలు మోడీ హామీలను విశ్వసిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసే కేంద్ర , రాష్ట్ర నాయకులకు జనం మద్ధతు పలికారు. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రత్యక్ష పోటీని ఇవ్వలేని కాంగ్రెస్ అసమర్థతను మరోసారి బట్టబయలు చేశాయి. హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం హస్తం పార్టీకే కాదు, ప్రతిపక్ష కూటమి ఇండియాకు కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగిన ఈ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ , బీజేపీ మధ్య ఎప్పుడూ ప్రత్యక్ష పోటీ ఉంటుంది. 2018లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లోని 61 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించడంతో కాంగ్రెస్‌కు పెద్దగా ఆశలు లేవు. 

కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించే మరో అంశం ఏమిటంటే, పార్టీ తన హామీల గురించి హిందీ హార్ట్‌ల్యాండ్‌లోని ప్రజలను ఒప్పించడంలో వైఫల్యం. కాంగ్రెస్ హామీలు దక్షిణాదిలో పార్టీకి సహాయపడినట్లు కనిపిస్తున్నాయి కానీ ఉత్తరాది ఓటర్లను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హామీలను విశ్వసించగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రజలు వాటిని తిరస్కరించి మోడీ హామీలకు మొగ్గు చూపారు. అలాగే, లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ కార్డ్‌గా విశ్వసించిన కుల గణన, గణనీయమైన OBC జనాభా ఉన్న హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లోని ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమైంది.

ప్రస్తుతం తెలంగాణలో గెలవడమే కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే ఏకైక అంశం. లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాదిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 3, కేసీఆర్‌ పార్టీ 9, బీజేపీ 4 గెలుపొందాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో లోక్‌సభ సంఖ్యను పెంచుకోవాలని భావించిన కాంగ్రెస్‌ వ్యూహం బాగానే వర్కవుట్ అయ్యింది. 
 

click me!